
విజయ్ దేవరకొండ-సమంతల రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి. ఫస్ట్ షో నుండే మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా యూఎస్ లో ఖుషి బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది. వీకెండ్ ముగిసే నాటికి ఖుషి మూవీ $ 1.4 గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఖుషి ఓవర్సీస్ హక్కులు రూ. 5.5 కోట్లకు అమ్మారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మూవీ సోమవారం నుండి లాభాల్లోకి ఎంటర్ అవుతుంది. వీక్ డేస్ లో కూడా ఖుషి వసూళ్లు మెరుగ్గా ఉండే సూచనలు కలవు.
ఖుషితో సమంత(Samantha) అరుదైన ఫీట్ సాధించింది. ఆమెకు ఇది 17వ వన్ మిలియన్ డాలర్ మూవీ. మరే సౌత్ హీరోయిన్ చేరుకొని అరుదైన రికార్డు ఇది. సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టారు. ఇక వరల్డ్ వైడ్ 65 % శాతం రికవరీ చేసినట్లు తెలుస్తుంది. ఏపీ/తెలంగాణ మూడు రోజుల షేర్ రూ. 29 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఏపీ/తెలంగాణాలలో ఖుషి రూ. 34 కోట్ల వరకు బిజినెస్ చేసింది. మరో ఐదు కోట్లు వస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది.
సోమవారం నుండి ఖుషి బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది చూడాలి. ఇక లాభాలు ఈ వీక్ పెర్ఫార్మన్స్ పై ఆధారపడి ఉంటాయి. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి మూవీ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 1న ఖుషి వరల్డ్ వైడ్ విడుదల చేశారు. సమంత-విజయ్ దేవరకొండల కెమిస్ట్రీ, సాంగ్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.