అన్న ఇంటికి వచ్చాడు... హీరో కార్తీ ఎమోషనల్ ట్వీట్

Published : Feb 11, 2021, 07:39 PM IST
అన్న ఇంటికి వచ్చాడు... హీరో కార్తీ ఎమోషనల్ ట్వీట్

సారాంశం

సూర్య ఆరోగ్యంపై కార్తీ అప్డేట్ ఇచ్చారు. సూర్య పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వచ్చాడని, కొన్నిరోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంటాడని అన్నారు. అలాగే అన్నయ్య క్షేమం కోసం ప్రార్ధనలు చేసిన ఫ్యాన్స్ మరియు వెల్ విషర్స్ కి ధన్యవాదాలు అంటూ కార్తీక్ ట్వీట్ చేశారు.   

హీరో కార్తీక్ సోషల్ మీడియా వేదికగా అన్న సూర్య ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. సూర్య పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వచ్చాడని, కొన్నిరోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంటాడని అన్నారు. అలాగే అన్నయ్య క్షేమం కోసం ప్రార్ధనలు చేసిన ఫ్యాన్స్ మరియు వెల్ విషర్స్ కి ధన్యవాదాలు అంటూ కార్తీక్ ట్వీట్ చేశారు. 

కొద్దిరోజుల క్రితం సూర్య కరోనా బారినపడినట్లు, చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆయన వైద్యులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది.  కోవిడ్ బారినపడిన సూర్య కోలుకున్నట్లు ఇంటికి చేరినట్లు ట్వీట్ చేసి, కార్తీ ఆయన ఫ్యాన్స్ కి మంచి వార్త పంచారు. ఆకాశం నీ హద్దురా మూవీతో భారీ హిట్ అందుకున్న సూర్య తిరిగి ఫార్మ్ లోకి వచ్చారు. 

ఇక కార్తీ విషయానికి వస్తే ఆయన నటించిన సుల్తాన్ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు భాగ్యరాజ్ కణ్ణన్ దర్సకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక మందనా సుల్తాన్ మూవీలో హీరోయిన్ గా నటించింది. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సుల్తాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Ram Charan ‌Daughter Klin Kaara: రామ్ చరణ్ ను నాన్న అనుకుండా..క్లీంకార ఏమని పిలుస్తుందో తెలుసా? మెగా పవర్ స్టార్ చెప్పిన సీక్రెట్..
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్‌ను మోసం చేయబోయిన భద్రావతి.. చివరి నిమిషంలో అడ్డుకున్న రామరాజు