
డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో హీరో గోపీచంద్ 30వ (Gopichand 30) చిత్రం తెరకెక్కుతుంది. మైసూర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో గోపీచంద్ ప్రమాదం బారినపడ్డారు. ప్రమాదవశాత్తు ఆయన కాలు జారీ కొంత ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తెలియజేశారు. భగవంతుడు దయతో ప్రమాదంలో గోపీచంద్ కి ఎటువంటి గాయాలు కాలేదు. కావున అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలియజేశారు.
గతంలో కూడా గోపీచంద్ (Gopichand)పలు మార్లు షూటింగ్స్ లో గాయాలపాలయ్యారు. 2019లో విడుదలైన చాణక్య మూవీ షూటింగ్ సమయంలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక 2007లో విడుదలైన లక్ష్యం సూపర్ హిట్ కాగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కుతుంది. పక్కా కమర్షియల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక విజయాల పరంగా వెనుకబడిన గోపీచంద్ తన అప్ కమింగ్ చిత్రాలపై చాలా ఆశలే పెట్టుకున్నారు. గోపీచంద్ గత చిత్రం సీటీమార్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా ఆడలేదు. సీటీమార్ మూవీలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటించిన విషయం తెలిసిందే.