Acharya OTT Release Date: `ఆచార్య` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్?.. మెగాస్టార్‌ ఫ్యాన్స్ కి సడెన్‌ సర్‌ప్రైజ్‌?

Published : Apr 29, 2022, 04:56 PM IST
Acharya OTT Release Date: `ఆచార్య` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్?.. మెగాస్టార్‌ ఫ్యాన్స్ కి సడెన్‌ సర్‌ప్రైజ్‌?

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ `ఆచార్య`. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం థియేటర్లో సందడి చేస్తుంది. అయితే ఓటీటీలో రిలీజ్‌కి సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నుంచి మూడేళ్ల తర్వాత వచ్చిన  సినిమా `ఆచార్య`(Acharya). `ఖైదీ నెం.150` తర్వాత చిరంజీవి నుంచి కమర్షియల్‌ సినిమా లేదు. `సైరా` హిస్టారికల్‌ మూవీగా నిలిచింది. క్రిటిక్స్ ని  నుంచి ప్రశంసలందుకుంది కానీ, కమర్షియల్‌గా యావరేజ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన `ఆచార్య` చిత్రంపై మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత రామ్‌చరణ్‌(Ram Charan) నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. పూజా హెగ్డే గ్లామర్‌ తోడు కాబోతుంది. 

ఈ నేపథ్యంలో `ఆచార్య` ఎట్టకేలకు నేడు(ఏప్రిల్‌ 29)న శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా థియేటర్లో రన్‌ అవుతుంది. సినిమాకి కాస్త మిక్స్ డ్ టాక్‌ వస్తుంది. చిరంజీవి రేంజ్‌లో సినిమా లేదనే టాక్‌ ప్రధానంగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా `ఆచార్య` ఫలితం ఇప్పుడు బెడిసికొట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీ రాబోయే డేట్‌ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ఆచార్య `అమెజాన్‌ ప్రైమ్‌`లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. సినిమాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటీటీ డిజిటల్‌ పార్టనర్‌గా అమెజాన్‌ ప్రైమ్‌గా చూపించారు. 

ఇదిలా `ఆచార్య` ఓటీటీ రిలీజ్‌ డేట్‌(Acharya OTT Release Date) కూడా కన్ఫమ్‌ అయ్యిందనే టాక్‌ వినిపిస్తుంది. ఈ సినిమాని మే ఎండింగ్‌లోగానీ, జూన్‌ మొదటి వారంలోగానీ ఓటీటీలో రిలీజ్‌ చేయబోతున్నారని సమాచారం. బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాలకు ఓటీటీలో రావడానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. అదే పరాజయం చెందిన చిత్రాలను నెలలోపే స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. `రాధేశ్యామ్‌` నెల రోజుల లోపే ఓటీటీలో విడుదలైంది. `గని` కూడా అంతే. అలాగే `బీస్ట్` కూడా వెంటనే ఓటీటీలో రాబోతుంది. 

ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ `ఆచార్య` చిత్రాన్ని కూడా నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్‌ చేయబోతున్నట్టు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో నిజమెంగా అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన తొలి చిత్రం `ఆచార్య`. గతంలో పాటల్లో మెరిశారు, కానీ నటించింది లేదు. ఫస్ట్ టైమ్‌ `ఆచార్య`లో చూస్తుండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇద్దరిని కలిసి చూడాలనేది చరణ్‌ మమ్మి సురేఖ డ్రీమ్‌ కూడా. ఈ చిత్రంతో ఆమె కోరిక నెరవేరిందని చెప్పొచ్చు. అయితే సినిమా హిట్‌ అయితే ఆమె ఇంకా సంతోషించేది. మరి పూర్తి ఫలితం మరో వీకెండ్‌తో తేలబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం