మూడేళ్లు ప్రేమించా, పెళ్లి చేసుకుందామనుకున్నా.. కాని ఆ అమ్మాయి అలా చేస్తుందనుకోలేదు: విశ్వక్ సేన్

Published : Apr 29, 2022, 05:24 PM ISTUpdated : Apr 29, 2022, 05:33 PM IST
మూడేళ్లు ప్రేమించా, పెళ్లి చేసుకుందామనుకున్నా.. కాని ఆ అమ్మాయి అలా చేస్తుందనుకోలేదు: విశ్వక్ సేన్

సారాంశం

మంచి మంచి కథలు సెలక్ట్ చేసుకుంటూ.. దూసుకెళ్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. యూత్ లో మంచి క్రేజ్ సాధించాడు యంగ్ హీరో. ఈ క్రేజీ హీరో నుంచి మంచి మాస్ సినమా కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి మాత్రం డిఫరెంట్ లుక్ తో అర్జున కళ్యాణం అంటూ బయలుదేరాడు విశ్వక్. 


మంచి మంచి కథలు సెలక్ట్ చేసుకుంటూ.. దూసుకెళ్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. యూత్ లో మంచి క్రేజ్ సాధించాడు యంగ్ హీరో. ఈ క్రేజీ హీరో నుంచి మంచి మాస్ సినమా కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి మాత్రం డిఫరెంట్ లుక్ తో అర్జున కళ్యాణం అంటూ బయలుదేరాడు విశ్వక్. 

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ అశోక వనంలో అర్జున కల్యాణం. ఈసినిమా త్వరలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన  ట్రైల‌ర్‌ రచ్చ రచ్చ చేస్తోంది. రుక్షర్‌ ధిల్లాన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమానువిద్యాసాగ‌ర్ చింతా డైరెక్ట‌ చేస్తున్నారు. మే 6న ప్రపంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయబోతోంది మూవీ. నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ హడావిడిలో బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్. 

విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విష్వక్సేన్ తాజాగా అశోకవనంలో అర్జునకల్యాణం తో సందడి చేయబోతున్నాడు.  విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  కార్యక్రమాల్లో హీరో విష్వక్సేన్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీలతో చిట్ చాట్ చేశారు. దాంట్లో కొన్ని  ఆసక్తికర సంగతులు వెల్లడించారు. 

గతంలో తన లవ్ బ్రేకప్ అయిందన్నారు విశ్వక్.  తాను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి తనను వదిలేసి వెళ్లిందన్నారు. ఈ విషయం చెపుతూ..విచారం వ్యక్తం చేశారు యంగ్ హీరో. అంత కాదు విచత్రంగా తన లవ్ బ్రేకప్ అయిన సంగతి తనకు నెల రోజుల తర్వాతే తెలిసిందని, అది మరింత బాధ కలిగించిందన్నారు. మూడేళ్లు ఆ అమ్మాయిని ప్రేమించానని, బ్రేకప్ సంగతి గుర్తుకు వస్తే ఇప్పటికీ ఎంతో బాధ కలుగుతుందన్నారు. విష్వక్సేన్ ఇన్ స్టా చిట్ చాట్ కు చెందిన వీడియోని అశోకవనంలో అర్జునకల్యాణం టీమ్ రిలీజ్ చేసింది. 

ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోయిన్ నివేదా పేతురాజ్ తో లవ్ లో మునిగి తేలుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. వరుసగా నివేద పేతురాజ్ తో సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. ఇక వీరి స్నేహం బలపడి   ప్రేమగా మారినట్టు సోషల్ మీడియా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక మే 6న రిలీజ్ కాబోతున్న విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా  విష్వక్సేన్ సరసన రుక్సార్ థిల్లాన్ నటించింది. పెళ్లి కోసం పాట్లు పడే 30 ఏళ్ల మధ్య తరగతి వ్యక్తిగా విష్వక్సేన్ ఈ చిత్రంలో అలరించనున్నట్టు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్