ఒక్క అభిమాని దూరమైనా తట్టుకోలేను... అభిమానులకు బాలయ్య విన్నపం!

By team teluguFirst Published Jun 7, 2021, 3:51 PM IST
Highlights

జూన్ 10న బాలకృష్ణ జన్మదినం. ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలోని బాలయ్య అభిమానులు ఆయను కలిసేందుకు, హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఈసారి కూడా భారీగా తరలి వచ్చి బాలయ్యకు స్వయంగా బర్త్ డే విషెష్ తెలియజేయాలని ఫ్యాన్స్ భావించారు. 

నటసింహం బాలకృష్ణ తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఓ ముఖ్య సందేశం విడుదల చేశారు. తనను కలవడానికి రావద్దంటూ అభ్యర్ధన చేశారు. జూన్ 10న బాలకృష్ణ జన్మదినం. ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలోని బాలయ్య అభిమానులు ఆయను కలిసేందుకు, హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఈసారి కూడా భారీగా తరలి వచ్చి బాలయ్యకు స్వయంగా బర్త్ డే విషెష్ తెలియజేయాలని ఫ్యాన్స్ భావించారు. కరోనా నేపథ్యంలో భౌతికమైన వేడుకలు ప్రమాదకరం అని బాలయ్య, ఫ్యాన్స్ ని హెచ్చరించారు. 


'నా ప్రాణ సమానులైన  అభిమానులకు ..ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు ..నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని ..కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు .. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను..మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు.  మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక ..దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ .. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..మీ నందమూరి బాలకృష్ణ ..' అంటూ పేస్ బుక్ అకౌంట్ ద్వారా విన్నవించారు. 

ఇక బాలయ్య బర్త్ డే కానుకగా అఖండ మూవీ నుండి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ అఖండ విడుదలకు బ్రేక్ వేసింది. నిజానికి మే నెలలో సమ్మర్ కానుకగా అఖండ విడుదల కావాల్సి ఉంది. అలాగే క్రాక్ తో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ తన తదుపరి చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 

click me!