ఇండియా చేరుకున్న బిగ్ బాస్ కౌశల్ భార్య నీలిమ!

Published : Jun 07, 2021, 02:31 PM IST
ఇండియా చేరుకున్న బిగ్ బాస్ కౌశల్ భార్య నీలిమ!

సారాంశం

కొద్దిరోజుల క్రితం కౌశల్ తన భార్య నీలిమ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు నీలిమకు ఏమైందో అని కంగారు పడ్డారు.   


బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. కౌశల్ భార్య కోవిడ్ నుండి కోలుకోవడంతో పాటు ఇండియా చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. కొద్దిరోజుల క్రితం కౌశల్ తన భార్య నీలిమ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు నీలిమకు ఏమైందో అని కంగారు పడ్డారు. 


ఫ్యాన్స్ ఆందోళన పడుతున్న నేపథ్యంలో నీలిమ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఉద్యోగ రీత్యా బ్రిటన్ వచ్చిన నాకు కరోనా సోకింది. ఇక్కడ చికిత్స కోసం హాస్పిటల్ లో చేరాను. ఇక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. వైద్య సిబ్బంది నాకు సరైన వైద్యం అందించడం లేదు. ఇక్కడ కంటే భారత్ లో పరిస్థితులు చాలా మెరుగు అని చెప్పాలి. పారాసిట్ మాల్ మినహా నాకు ఎటువంటి మెడిసిన్ ఇవ్వడంలేదని ఆమె ఆవేదన చెందారు. 


కాగా కరోనా బారిన పడిన 8రోజులలో తనకు నెగిటివ్ రాగా, ఇండియా చేరుకున్నట్లు కౌశల్ తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ లో ఆయన ఫ్యామిలీ ఫోటో పంచుకోవడంతో పాటు, మీ ప్రార్ధనలకు ధన్యవాదాలు. జై పారాసిట్ మాల్ అంటూ కామెంట్ పెట్టాడు. తాజా పోస్ట్ కౌశల్ అభిమానులకు సంతోషం పంచింది. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : బాంబ్ పేల్చిన దాసు, షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ, జ్యో రహస్యం బయటపడిందా ?
Gunde Ninda Gudi Gantalu: ఓవైపు శివ, మరోవైపు ప్రభావతి.. బాలు, మీనా కాపురంలో చిచ్చు పెట్టేశారుగా..!