
మెగా-అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనేది కొన్నాళ్లుగా పరిశ్రమలో వినిపిస్తున్న వాదన. అలాగే అల్లు అర్జున్ మెగా హీరో ట్యాగ్ పోగొట్టుకోవాలనుకుంటున్నారని. అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు హీరో అనిపించుకోవాలి అనుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ చర్యలు అనుమానాలు రేపుతున్నాయి. కాగా మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే. అల్లు అర్జున్ కనీసం బర్త్ డే విషెస్ చెప్పలేదు. సాయంత్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీకి రాలేదు.
దీంతో పుకార్లు మరింతగా ఊపందుకున్నాయి. చరణ్ - అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు అల్లు అర్జున్ చెక్ పెట్టారు. అల్లు అర్జున్-స్నేహారెడ్డి వెకేషన్ కి వెళ్లారు. వీరితో పాటు చిరంజీవి ఇద్దరు కుమార్తెలు శ్రీజ, సుస్మిత జాయిన్ అయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఈ టూరు కి వెళ్లినట్లు తెలుస్తోంది.
వీరి వెకేషన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో చిరంజీవి, చరణ్ లతో అల్లు అర్జున్ కి విబేధాలన్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఒక వేళ రామ్ చరణ్ తో గొడవలు ఉంటే ఆయన సిస్టర్స్ తో బన్నీ దంపతులు టూర్ కి వెళ్లరు కదా అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ ఊర్లో లేకపోవడం వలనే రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి హాజరు కాలేదని క్లారిటీ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు... బహుశా బన్నీ నేరుగా ఫోన్ చేసి ఉండొచ్చు. మెగా హీరోలందరూ ఒకటే అని నమ్మే డైహార్డ్ ఫ్యాన్స్ ఇదే అనుకుంటున్నారు.
మరోవైపు ఈ ఇద్దరు మెగా హీరోలు ఫేమ్ లో ఒకరికి మించి మరొకరు పోటీపడుతున్నారు. పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా అవతరించారు. చరణ్ ఏకంగా ఆర్ ఆర్ ఆర్ తో ఆస్కార్ అందుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు.