
టాలీవుడ్ లో తనకంటూ డిఫరెంట్ ఇమేజ్ ను క్రియేుట్ చేసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. రొటీన్ కు భిన్నంగా ఆలోచిస్తూ.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నాడు కళ్యాన్ రామ్. రీసెంట్ గా వచ్చిన బింబిసార మూవీతో తన స్టోరీ సెలక్షన్ పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్. .. ఈసినిమాతో సూపర్ హిట్ సాధించాడు. హీరోగా తనదైన వెర్సటాలిటీతో మెప్పిస్తోన్న నందమూరి కళ్యాణ్ రామ్..లేటెస్ట్ గా చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది.
ఎలాగైన ఈసినిమాతో... సక్సెస్ సాధించి తన జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. సక్సెస్ వేవ్స్ ను జారిపోకుండా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ఈమూవీ షూటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈసినిమాలో కూడా నెగెటీవ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట నందమూరి హీరో.
ఇక ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే.. ఈమూవీ ఫైనల్ స్టేజ్ షెడ్యూల్ లో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ కోసం యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారట. వైజాగ్ లో జరుగుతున్న ఈ షూటింగ్ లో.. 500 మందితో ఈ ఫైట్‌ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సీన్స్ చేస్తున్న టైమ్ లో కళ్యాణ్ రామ్ కు గాయం అయినట్టు తెలుస్తోంది. కాలుకి కాలిన గాయంతో..చర్మ పైకి లేవడంతో.. ప్రధమ చికిత్స చేసి.. హాస్పిటల్ కు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది.
ఈవిషయం తెలిసి నందమూరి అభిమానులు ఆంధోళన చెందుతున్నారు. అయితే చిన్నగాయమే అని మూవీ టీమ్ వారికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈహూవీ. అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఇక విశాఖలో .. ఈమూవీకి చెందిన యాక్షన్ సీన్స ను ఫైట్ మాస్టర్ వెంకట్ కంపోజ్ చేస్తున్నారు. అన్నీ పనులు పూర్తి చేసి.. కుదిరితే ఈ సమ్మర్ వరకూ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.