హార్ట్ ఎటాక్ నుంచి కోలుకుని బ్యాక్ టూ సెట్స్... సుస్మితా సేన్ పోస్ట్ వైరల్

Published : Mar 30, 2023, 12:47 PM ISTUpdated : Mar 30, 2023, 12:50 PM IST
హార్ట్ ఎటాక్ నుంచి కోలుకుని బ్యాక్ టూ సెట్స్... సుస్మితా సేన్ పోస్ట్ వైరల్

సారాంశం

హార్ట్ ఎటాక్ నుంచి కోలుకుంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్.. చాలా త్వరగా రికవరీ అయ్యి.. షూటింగ్ కు కూడా వచ్చేసింది.   

రీసెంట్ గా  గుండెపోటుకు గురైంది బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్.  మార్చి 2 ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది సుస్మితా. రెండు రోజుల క్రితం నాకు గుండెపోటు వచ్చింది. డాక్టర్లు నాకు  యాంజియోప్లాస్టీ చేశారు. గుండెలో  స్టెంట్ కూడా  వేశారు. ఇకపై ఎలాంటి భయం అవసరం లేదు అన్నారు. డాక్టర్లు నాకు ధైర్యం ఇచ్చారు అంటూ పోస్ట్ చేసింది సుస్మితా.. ఈ పోస్ట్ చూసి అభిమానులు భయపడ్డారు. ఏమైందా అని ఆధోళన పడ్డారు.

అభిమానులకు స్వయంగా ధైర్యం ఇచ్చిన సుస్మితా.. తాజాగా  గుండెపోటు నుంచి కోలుకునిమళ్ళీ షూటింగ్ లకు వెళ్తోంది.. వర్క్ లో బిజీ బిజీ  అవుతుంది. రీసెంట్ గా ఓ ఫ్యాషన్ పరేడ్ లో..  ర్యాంప్ వాక్ లో పాల్గొని సందడి చేయడమే కాకుండా, తాను నటించిన తాళి వెబ్ సిరీస్ డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. తాజాగా కెమెరా ముందుకి వచ్చి షూటింగ్ లో కూడా పాల్గొంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియో పోస్ట్ వేసింది. ఆ వీడియోలో సుస్మితా.. తన మొఖంతో పలు హావభావాలు పలికిస్తూ కనిపిస్తుంది. ఇక ఆ పోస్ట్ కింద ఇలా రాసుకొచ్చింది.

 

నా యాంజియోప్లాస్టీ పూర్తి అయ్యి నెల అయ్యింది. ఇష్టమైన పని చేయడమే వలనే నేను త్వరగా కోలుకోగలిగాను. లైట్స్, కెమెరా, యాక్షన్, మ్యూజిక్.. ఇవన్నీ నా మదిలో రిపీట్ ప్లే అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి థాంక్యూ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ పోస్ట్ కి అభిమానులు రెస్పాండ్ అవుతూ.. సుస్మితా సేన్ పై తమ అభిమానం, ప్రేమని వ్యక్తపరుస్తున్నారు. అన్నారు. ప్రస్తుతం సుస్మితా సేన్ ఫోస్ట్ సోషల్ మీడియాలు వైరల్ అవుతుంది. నెటిజన్లు తో పాటు.. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆమెకు అభినందనలు చెపుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్