Latest Videos

కిరాక్ ఆర్పీ చేపల పులుసు హోటల్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాశనం చేశారా? ఇదిగో క్లారిటీ!

By Sambi ReddyFirst Published Jun 12, 2024, 4:33 PM IST
Highlights

ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ నడుపుతున్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వెనకున్న నిజానిజాలు ఏమిటో చూద్దాం... 
 

కిరాక్ ఆర్పీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతు ప్రకటించాడు. ముఖ్యంగా ఆయన జనసేన కోసం ప్రచారం చేశాడు. అదే సమయంలో వైసీపీ నేతల పై, వై ఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశాడు. అయితే మెగా ఫ్యామిలీ కి చెందిన అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. ఏకంగా శిల్పా రవిరెడ్డి ఇంటికి అల్లు అర్జున్ సతీసమేతంగా వెళ్ళాడు. ఈ పరిణామం కూటమి నేతలకు ఆగ్రహం కలిగేలా చేసింది. 

అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం నచ్చలేదని కిరాక్ ఆర్పీ విమర్శలు చేశాడు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిరాక్ ఆర్పీ పై దాడి చేశారంటూ వార్తలు వచ్చాయి. కిరాక్ ఆర్పీ నిర్వహిస్తున్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్స్ పై దాడి చేశారంటూ ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో నిజమేనా? కాదా? అని ఆరా తీస్తే ఫేక్ అని తేలింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేశారంటూ ప్రచారం అవుతున్న వీడియో నిజం కాదు. 

వాస్తవానికి ఆ వీడియో 2024 జనవరి 1న హైదరాబాద్ లో గల అబిడ్స్ లో ఓ హోటల్ సిబ్బందికి కస్టమర్లకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం దాడి చేసుకున్నారు. ఆ వీడియో వైరల్ చేస్తున్న కొందరు కిరాక్ ఆర్పీ హోటల్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేశారని ప్రచారం చేస్తున్నారు. కాగా ఓ వీడియో కిరాక్ ఆర్పీ అల్లు అర్జున్ కి సవాలు విసరడం సంచలనంగా మారింది. నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ... నేను ఎవడికీ భయపడను. నీ పతనం మొదలవుతుంది... అని ఆ వీడియో కిరాక్ ఆర్పీ అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 

Attack on customers at a restaurant: *Abids Grand Hotel waiters attacked customers*

At midnight on December 31, waiters of the Grand Hotel behind the Abids Post Office attacked and injured customers with sticks. On hearing the matter Goshamahal MLA Rajasingh immediately… pic.twitter.com/ZKTAaJ4cxz

— Saye Sekhar Angara (@sayesekhar)

 

 

click me!