‘హిట్ 2’ మూవీలో కీ రోల్ ప్లే చేసిన మాక్స్ తాజాగా కన్నుమూసింది. ఉన్నట్టుండి చనిపోవడంతో అడివిశేషు భావోద్వేగమయ్యారు. షూటింగ్ సమయంలో అది సహకరించిన తీరును తెలియజేస్తూ నోట్ రాసుకొచ్చారు.
సినిమాల్లో నటీనటులు, టెక్నీషియన్లే కాకుండా ఆయా సన్నివేశాల్లో పెట్స్ ను కూడా దర్శకులు చూపిస్తుంటారు. వాటితో ప్రత్యేకమైన సన్నివేశాలను చిత్రీకరించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డాగ్స్ ను కీలక సన్నివేశాల కోసం సినిమాల్లో చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న Hit2 చిత్రంలో మేజర్ హీరోగా నిలిచిన మాక్స్ (Max) గురించి అందరికీ తెలిసిందే. బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందిన డాగ్ అది. దాని అసలు పేరు సాషా.
ఇక తాజాగా సాషా కన్నుమూసింది. తీవ్ర జర్వం రావడంతో కోలుకోలేకపోయింది. ఈరోజు తుదిశ్వాస విడిచింది. సాషా మరణించడంతో నివాళి అర్పిస్తూ అడివి శేషు పోస్టు పెట్టారు. చేధువార్తను తెలుసుకొని భావోద్వేగమయ్యారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ‘టిక్ ఫీవర్ కారణంగా సాషా మరణించింది. ఈ వార్తను చెప్పేందుకు బాధాకరంగా ఉంది. అది HIT2లో MAX పాత్రను పోషించింది. మేము ఆస్ప్రతికి తీసుకెళ్లాం. తిరిగి మాక్స్ కోలుకుంటుందని ఆశించాం. కానీ ఫలితం లేదు. ఈ విషయాన్ని రాసేప్పుడూ కూడా కన్నీళ్లు ఆగలేదు.
అత్యంత కఠినమైన షూట్ లోనూ బేబీ గర్ల్ (సాషా) మమ్మల్ని సహించినందుకు ధన్యవాదాలు. నువ్వు మా అందరికీ సంతోషానిచ్చావు. యానిమల్స్ లో అద్భుతమైన ఛాంపియన్ అయిన ఆమె యజమాని/కుటుంబం/శిక్షకుడు ఆనంద్‌కు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.‘ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘హిట్2’లో మాక్స్ పాత్రలో కనిపించిన సాషా సన్నివేశాలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. దీంతో అందరికీ మాక్స్ పాత్ర బాగా గుర్తుండిపోయింది.
‘హిట్ వెర్స్’లో భాగంగా హిట్2 చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. నాని ఈ చిత్రానికి నిర్మాత. తర్వాత Hit3 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సైంధవ్’ తర్వాత శైలేష్ హిట్3ని డైరెక్ట్ చేయబోతున్నారు. నాని మూడో కేసును చేధించబోతున్నారు. ఇక తొలిసారిగా పోలీసు పాత్రలో అలరించబోతుండటం విశేషం. ఇక అడివి శేషు ‘మేజర్’, ’హిట్2‘తో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ‘గూఢాచారి 2’లో నటిస్తున్నారు.
Absolutely Devastated to give the news that Sasha has passed due to Tick Fever. She played MAX in
When we visited her at the Vet Hospital, it really looked like she might pull through. The fight was too much for her in the end. 💔
Tears as I type this.
Thank you for… pic.twitter.com/jXHycT1m57