
విశాల్ తెలుగు తమిళ భాషల్లో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. విశాల్ ని తెలుగు ప్రేక్షకులు ఇక్కడి నటుడిగానే ప్రేమ కురిపిస్తారు. తెలుగు రాష్ట్రాలతో విశాల్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. విశాల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏపీలోనే మొదలయింది. సినిమాలతో పాటు ఇతర వ్యవహారాలు, వివాదాలతో కూడా నిత్యం విశాల్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ విశాల్ తనదైన శైలిలో వరుసగా చిత్రాలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు.
ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఎస్ జె సూర్య నటిస్తున్నాడు.దీనితో ఆడియన్స్ లో వీరిద్దరి కాంబినేషన్ పై ఆసక్తి పెరిగిపోయింది. ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్ బాణీలు అందిస్తున్నారు.
తన కెరీర్ లో తొలిసారి విశాల్ తెలుగు ఆడియన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. మార్క్ ఆంటోని చిత్రం కోసం విశాల్ తెలుగులో తానే స్వయంగా పాట పాడుతున్నడు. విశాల్ సింగర్ గా తొలిసారి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. విశాల్ తెలుగు వాడే కాబట్టి సాంగ్ పాడడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఈ చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు తమిళంలో అయితే ఒకేసారి రిలీజ్ కానుంది. దీనితో ఒక్కో భాషల్లో ఒక్కో సెలెబ్రిటీతో పాట పాడించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తెలుగులో ఎవరైతే బావుంటుంది అని అనుకుంటున్న తరుణంలో దర్శకుడికి విశాల్ తోనే పాడించాలని ఆలోచన వచ్చింది.
ఈ విషయాన్ని సాంగ్ ప్రోమో ద్వారా సరదాగా వివరించారు. తెలుగులో ఒక సెలబ్రిటీ కావాలి ఈ పాట కోసం అని దర్శకుడు ఆలోచిస్తుంటాడు. విశాల్ అప్పుడే వస్తాడు. వెంటనే డైరెక్టర్ మైక్ విశాల్ కి ఇచ్చి మీరే పాడుతున్నారు అని చెబుతాడు. సాంగ్ ప్రోమో కూడా చూపించారు. 'అదరదా గుండె అదరదా మామ.. వచ్చినది అన్న ఆంటోని రా' అంటూ విశాల్ తన పవర్ ఫుల్ వాయిస్ తో ఈ మాస్ సాంగ్ ని పాడాడు. కంప్లీట్ సాంగ్ తో గూస్ బంప్స్ గ్యారెంటీ అనే అనే ఫీలింగ్ వస్తోంది. త్వరలోనే లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.