కుమార్తె క్లీంకార కోసం స్పెషల్ ఇంటీరియర్ డిజైన్ రెడీ చేసిన రాంచరణ్, ఉపాసన.. ఫారెస్ట్ తరహాలో అందంగా..

Published : Jul 14, 2023, 12:56 PM IST
కుమార్తె క్లీంకార కోసం స్పెషల్ ఇంటీరియర్ డిజైన్ రెడీ చేసిన రాంచరణ్, ఉపాసన.. ఫారెస్ట్ తరహాలో అందంగా..

సారాంశం

రాంచరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు నిచ్చింది. దీనితో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంతోషంలో మునిగితేలారు.

రాంచరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు నిచ్చింది. దీనితో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంతోషంలో మునిగితేలారు. స్వయంగా రాంచరణ్ మీడియా ముందుకు వచ్చి తన సంతోషాన్ని పంచుకున్నారు. 

ఇటీవలే సాంప్రదాయ బద్దంగా మెగా వారసురాలికి క్లీంకార అని నామకరణం చేశారు. చిన్నారికి లలితా సహస్ర నామంలోని పదాలు కలిసేలా.. అమ్మవారి ఆశీర్వాదం శక్తి తోడయ్యేలా ఈ పేరు పెట్టినట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి క్లీంకార కొణిదెల KKK అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది. ఇక మెగా దంపతులు చరణ్, ఉపాసన తమ కుమార్తె ఆలనా పాలనా ఎలా చూసుకుంటున్నారు అనే ఆసక్తి కూడా ఉంది. 

తమ కుమార్తె అత్యుత్తమంగా మంచి వాతావరణంలో పెరిగేలా ఉపాసన, చరణ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారి క్లీంకార కోసం రాంచరణ్, ఉపాసన ఒక ప్రత్యేక గదిని బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో రెడీ చేశారు. అంటే అత్యాధునిక హంగులు అని అర్థం కాదు.. చిన్నారి పెరిగేందుకు మంచి వాతావరణం ఉండేలా.. పిల్లలు కోరుకునే బొమ్మలు ఉండేలా ఈ గదిని డిజైన్ చేశారు. ఈ వీడియో ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

పవిత్ర రాజారామ్ అనే ఆర్కిటెక్ట్ తో ఉపాసన ఈ డిజైన్ రెడీ చేశారు. ఉపాసన ఆమెకి తమ పాప కోసం ఫారెస్ట్ థీమ్ లో ఉండే డిజైన్ కావాలని కోరారట. పిల్లలు కోరుకునే విధంగా ఫారెస్ట్ లోనే వివిధ జంతువుల బొమ్మలు, చెట్లు ఉండే బోర్డులు, సాఫ్ట్ గా వైట్ థీమ్ లో ఉండే సోఫాలు మ్యాట్ లు, టేబుల్స్ ఇలా ఆహ్లాద భరితంగా గదిని డిజైన్ చేయించారు. 

కబోర్డ్స్ లో వివిధ జంతువుల బొమ్మలు ఉండేలా తీర్చి దిద్దారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా వారసురాలు అంటే కేరింగ్ ఆ మాత్రం ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు గదిని ఎంతో అందంగా తీర్చి దిద్దారు.. కానీ బేబీ పెరిగే కొద్దీ అల్లరి చేస్తే రూమ్ మొత్తం ధ్వంసం అవుతుంది.. చిందర వందరగా మారుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు