పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ కు రెడీ అవుతున్నారు. ఆయన పూర్తి స్దాయిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జనసేనను ను ఆంద్రప్రదేశ్ లో నెక్ట్స్ లెవిల్ లు కి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, స్పీచ్ లతో ఆయన సినిమాలు చేసే అవకాసం దొరకటం లేదు.
"వకీల్ సాబ్" సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో కొన్ని మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. దసరా తర్వాత రాజకీయాల్లో బిజీ అవుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేనను ను ఆంధ్రప్రదేశ్ లో నెక్ట్స్ లెవిల్ లు కి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, స్పీచ్ లతో బిజీగా ఉండటంతో ఆయనకు సినిమాలు చేసే అవకాశం దొరకటం లేదు. ఇప్పుడు పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేయబోతున్నారు. మరొక 30 నుంచి 40 రోజులు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే మిగతా సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుందని వినికిడి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో "వినోదయ సితం" అనే తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారా లేదన్నదే ప్రశ్నార్దంగా మారింది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. మరో ప్రక్క హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయాల్సిన "భవదీయుడు భగత్ సింగ్" సినిమా విషయంలో చాలా డేట్స్ కేటాయించాల్సి వస్తుందని, అంత టైమ్ లేదని ప్రక్కన పెట్టాడని వార్తలు వస్తున్నాయి. దాంతో హరీష్ శంకర్ ఇప్పుడు మరో హీరో కోసం ట్రైల్స్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ముంబైలో ఉండి సల్మాన్ ఖాన్ కోసం వెతుకుతున్నారని అంటున్నారు.
మరో ప్రక్క చిరంజీవితో ఓ సినిమా చేయాలని హరీష్ శంకర్ కు ఎప్పటినుంచో ఉందని, చిరు కూడా ఆసక్తి చూపిస్తున్నారని చెప్తున్నారు. ఈ క్రమంలో తాను ఇష్ట పడ్డ ఒక మలయాళ సూపర్‌హిట్ మూవీ రీమేక్‌కి హరీషైతేనే బెటరని ఫిక్సయ్యారట చిరు. మోహన్‌లాల్, పృథ్విరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన హిలేరియస్ సినిమా ఇది. దీన్ని తెలుగులో రీప్రొడ్యూస్ చేసే బాధ్యతను హరీష్ తీసుకున్నారట. తండ్రిగా చిరంజీవి చేస్తారని, తనయుడిగా మరో మెగాహీరో బోర్డ్‌లోకి వస్తారని అంటున్నారు.
అయితే భవదీయుడు భగత్ సింగ్ సినిమా కథ విపరీతంగా చిరంజీవికి నచ్చింది. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ...ఈ సినిమా చిరుతో చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆ ప్రాజెక్టునే చిరు తో హరీష్ చేసే అవకాసం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ కు రాసుకున్న కథని హరీష్...చిరుతో చేస్తాడా అనేదే పెద్ద క్వచ్చిన్. ఏదైమైనా తన రాజకీయ పనులన్నీ పూర్తయిన తరువాత మాత్రమే ఈ సినిమా పట్టాలెక్కించాలని పవన్ అనుకుంటున్నారట. అంటే 2024 ఎలక్షన్ల దాటే వరకు ఈ సినిమా పట్టాలెక్కి అవకాశాలు లేవన్న మాట.