ఆగస్ట్ 7న ఏంజెల్ ట్రైలర్ విడుదల

Published : Aug 04, 2017, 09:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఆగస్ట్ 7న ఏంజెల్ ట్రైలర్ విడుదల

సారాంశం

సరస్వతి ఫిలింస్ బేనర్ పై నాగ అన్వేశ్, హెబా పటేల్ జంటగా ఏంజెల్ రాజమౌళి శిష్యుడు, నూతన దర్శకుడు బాహుబలి పళని దర్శకత్వం 40 నిమషాలకి పైగా గ్రాఫిక్స్ హంగులతో రెడీ అవుతున్న ఏంజెల్

 

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగాఅన్వేష్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం 'ఏంజెల్'. సోషియోఫాంటసీ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి శిష్యుడు, నూతన దర్శకుడు బాహుబలి పళని. దాదాపు 40 నిమషాలకి పైగా గ్రాఫిక్స్ హంగులతో రెడీ అవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోకి విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం ఇది వరకే ప్రకటిచింది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 7న ఏంజెల్ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయని, తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు పళని తెలిపారు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా దర్శకనిర్మాతలు ప్రకటించారు.

బ్యానర్- శ్రీ సరస్వతి ఫిల్మ్స్
తారాగణం-
హీరో- నాగ అన్వేష్
హీరోయిన్- హేబా పటేల్
సుమన్, సప్తగిరి, కబీర్ ఖాన్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రియదర్శీ, ప్రభాస్ శ్రీను, సన
సాంకేతిక వర్గం
ప్రొడ్యూసర్- భువన్ సాగర్
డైరెక్టర్- 'బాహుబలి' పళని
సంగీత దర్శకుడు- భీమ్స్ సెసిరోలియో 
సినిమాటోగ్రఫి - గుణ

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే