కోలీవుడ్ ఎంట్రీకి క్రేజీ ఆఫర్ దక్కించుకున్న హెబాపటేల్

Published : Jun 16, 2017, 12:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
కోలీవుడ్  ఎంట్రీకి క్రేజీ ఆఫర్ దక్కించుకున్న హెబాపటేల్

సారాంశం

 తెలుగులో క్రేజీ హీరోల సరసన ఆఫర్ దక్కించుకోలేక పోయిన హెబా పటేల్ తమిళంలో కుమారికి క్రేజీ ఆఫర్ సుకుమార్ 100% లవ్ సినిమా తమిళ రీమేక్ కు హెబా పటేల్ 

తెలుగులో క్రేజీ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్న అప్ కమింగ్ బ్యూటీ హెబా పటేల్... కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమైందట... టాలీవుడ్ లో హిట్ అయిన మూవీ రీమేక్‌లో ఆమెకు ఛాన్స్ దాదాపు ఖాయమైందట.

 

కొన్నేళ్ల క్రితం తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న 'హండ్రెడ్ పర్సెంట్ లవ్' సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ కానుంది... ఈ రీమేక్‌లో హీరోగా జి.వి.ప్రకాశ్ ఫిక్స్ అయ్యాడు... అయితే హీరోయిన్ తమన్నా రోల్‌ని ఎవరితో రీ ప్లేస్ చేయాలనే విషయమే ఇంకా ఎటూ తేలడం లేదు. మొదట 'హండ్రెడ్ పర్సెంట్ లవ్' కోలీవుడ్ వర్షన్‌లోనూ మిల్కీ బ్యూటీనే హీరోయిన్ అని కొంతకాలం ప్రచారం జరిగినా... ఆ తరువాత ఈ ఛాన్స్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సొంతమైందని అంతా అనుకున్నారు.

 

కోలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న లావణ్య త్రిపాఠి ఈ ఛాన్స్ ను వదులుకునే అవకాశం లేకపోవడంతో... ఈ సినిమా కోలీవుడ్ వర్షన్ లో లావణ్య నటించడం ఖాయమే అని చాలామంది భావించారు. అయితే ఆ ఛాన్స్ అనుకోకుండా హెబా పటేల్ సొంతమైందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఆఫర్ పలకరించగానే మరో మాట ఆలోచించకుండా ఓకే చెప్పిన టాలీవుడ్ కుమారి... ఈ సినిమాకు సైన్ కూడా చేసేసిందని టాలీవుడ్ సర్కిల్స్ టాక్... కోలీవుడ్ అవకాశం కోసం హెబా కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోందని... అందుకే ఛాన్స్ దొరకగానే ఓకే అనేసిందని అంటున్నారు. ఈ నయా మూవీ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుందని సమాచారం... అయితే సుకుమార్ రికమండేషన్ కారణంగానే హెబాకు ఈ అవకాశం వచ్చిందని టాక్. మరి ఈ సినిమాతో హెబ్బా తమిళంలో జెండా పాతుతుందేమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

హిట్టు మీద హిట్టు, 65 ఏళ్ల వయసులో రెమ్యునరేషన్ భారీగా పెంచిన వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాకు ఎంతంటే?
దళపతి విజయ్ కి కోర్టులో ఎదురుదెబ్బ... జన నాయగన్‌కు సెన్సార్ కష్టాలు, నెక్స్ట్ ఏంటి?