50 రోజులు.. 1050 థియేటర్లు.. సాహో బాహుబలి

First Published Jun 16, 2017, 12:21 PM IST
Highlights
  • 50 రోజులు పూర్తి చేసుకున్న సెన్సేషనల్ మూవీ బాహుబలి
  • దేశవ్యాప్తంగా 1050 థియేటర్లలో 50 రోజులుగా రన్ అవుతున్న బాహుబలి
  • త్వరలో చైనాతోపాటు మరికొన్ని యూరప్ దేశాల్లోనూ బాహుబలి రిలీజ్

తెలుగు సినిమా కీర్తిని దశదిశలా చాటిన సినిమా జక్కన్న రాజౌమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం బాహుబలి. రోజుకో రికార్డు సృష్టిస్తూ కలెక్షన్స్ రికార్డుల్లో దూసుకుపోతున్న బాహుబలి-2 చూస్తుండగానే.. 50 రోజులు పూర్తిచేసుకుంది. ఏప్రిల్ 28న విడుదలైన ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1076 తెరలపై నేటితో 50-రోజులు పూర్తి చేసుకుంది.

బాహుబలి2 దేశవ్యాప్తంగా 1051 స్క్రీన్స్ పై ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అటు ఓవర్సీస్ లో ఏకంగా 25 స్క్రీన్స్ పై “ది కంక్లూజన్” కొనసాగుతోంది. ఓవర్సీస్ లో వారం రోజులు ఆడడమే ఎక్కువ. అలాంటిది 25 స్క్రీన్స్ పై 50 రోజులు పూర్తి చేసుకుంది బాహుబలి-2.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 282 స్క్రీన్స్ పై బాహుబలి-2 చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులో 120, కేరళలో 102, కర్నాటకలో 58 తెరలపై ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది ఈ సినిమా.

టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు మల్లూవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి – ది కంక్లూజన్ సినిమా నిలిచింది.

త్వరలోనే ఈ సినిమాను చైనాతో పాటు మరికొన్ని యూరోప్ దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బాహుబలి-2ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. మరి బాహుబలి కలెక్షన్స్ రికార్డులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో.

click me!