లెజండరీ డైరెక్టర్ మణిరత్నంకి గుండెపోటు!

Published : Jul 26, 2018, 04:29 PM IST
లెజండరీ డైరెక్టర్ మణిరత్నంకి గుండెపోటు!

సారాంశం

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మణిరత్నం పేరు తెలియని వారుండరు. ఆయన సినిమాల్లో ఒక్క అవకాశమొస్తే చాలని కోరుకునే హీరోలు కోకొల్లలు. గీతాంజలి, రోజా, బొంబాయి ఇలా ఆయన ఏ సినిమా తీసినా అద్భుతమే

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మణిరత్నం పేరు తెలియని వారుండరు. ఆయన సినిమాల్లో ఒక్క అవకాశమొస్తే చాలని కోరుకునే హీరోలు కోకొల్లలు. గీతాంజలి, రోజా, బొంబాయి ఇలా ఆయన ఏ సినిమా తీసినా అద్భుతమే.. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించే మణిరత్నం కొన్నాళ్లుగా హిట్ సినిమా కోసం పరితపిస్తున్నారు.

మధ్యలో 'ఓకే బంగారం' వంటి సినిమా తీసినా.. ఆ తరువాత తెరకెక్కించిన 'చెలియా' నష్టాల్నే మిగిల్చింది. ప్రస్తుతం ఆయన తమిళంలో స్టార్ హీరోలతో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే సడెన్ గా ఈరోజు మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో వెంటనే ఆయనను చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలించారని సమాచారం. వైద్యులు మణిరత్నానికి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు సడెన్ గా ఇలా జరగడంతో అభిమానులు షాక్ లో ఉన్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ముకేశ్ కోసం వర్షిణి త్యాగం, లెక్కలు మార్చేసిన నరేష్.. కొత్త కెప్టెన్ గా వంశీ
Vijay Sethupathi: ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ప్రెజెంటర్ గా విజయ్ సేతుపతి.. విలక్షణ నటుడికి అరుదైన గౌరవం