బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయా..? ప్రముఖ నటి

First Published Jul 26, 2018, 3:57 PM IST
Highlights

ఇండస్ట్రీలో ఈ వివాదం వెలుగులోకి రావడం వలన చాలా మందికి ఈ విషయంపై అవగాహన వచ్చింది. నా వరకు నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదు. బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయనుకుంటే ఎలా..? 

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎటు చూసిన కాస్టింగ్ కౌచ్ ప్రస్తావనే.. నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణల కారణంగా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ మీరు ఎదుర్కొన్నారా..? అంటూ మీడియా ముందుకు వచ్చే ప్రతి హీరోయిన్ ను ప్రశ్నిస్తున్నారు. కొందరు తారలు కాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తెలియదు కానీ మేము అలాంటి చేదు అనుభవాలు ఎదుర్కోలేదని అన్నారు. మరికొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ ఉందని బహిరంగంగానే కామెంట్స్ చేశారు.

తాజాగా కాస్టింగ్ కౌచ్ విషయంపై స్పందించమని కొందరు మీడియా సభ్యులు నటి పూజాకుమార్ ను అడిగారు. ఈ సందర్భంగా ఆమె ఘాటు సమాధానాలు ఇచ్చింది. ''ఇండస్ట్రీలో ఈ వివాదం వెలుగులోకి రావడం వలన చాలా మందికి ఈ విషయంపై అవగాహన వచ్చింది. నా వరకు నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదు. బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయనుకుంటే ఎలా..? టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేసి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉంటూ కూడా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవచ్చు'' అని వెల్లడించింది.

'ఉత్తమ విలన్','గరుడ వేగ' వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన పూజా కుమార్ 'విశ్వరూపం2' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన పూజాకుమార్ కాస్టింగ్ కౌచ్ పై ప్రస్తావించింది. 

click me!