నాన్నను బెదిరించి హిరోయిన్ అయింది మన ముద్దుల షాలిని

Published : Aug 31, 2017, 05:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
నాన్నను బెదిరించి హిరోయిన్ అయింది మన ముద్దుల షాలిని

సారాంశం

తొలి చిత్రంతోనే ప్రేక్షుకులను తన అభినయంతో కట్టిపడేసింది. సినిమాల్లోకి రావడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు అన్ని ముద్దు సీన్లు ఉంటాయని డైరెక్టర్ నాకు  చెప్పలేదు

 

ఇటీవల విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘ అర్జున్ రెడ్డి’.  పలువురి ప్రముఖుల ప్రశంసలు, విమర్శలతో సినిమా కి ప్రచారం బాగా పెరిగింది. దీంతో సినిమాలోని నటీనటులకు కూడా అదే విధంగా క్రేజ్ పెరిగింది.  ఈ సినిమాలో.. విజయ్ దేవరకొండ హీరోగా నటించగా.. షాలిని హీరోయిన్ పాత్రలో నటించారు.

విజయ్ దేవర కొండ.. ‘ ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘ పెళ్లి చూపులు’ సినిమాతో అందరికీ పరిచయమే.. కానీ షాలినికి ఇదే మొదటి చిత్రం.తొలిచిత్రంతోనే ప్రేక్షకులకు చేరువైన షాలిని.. తన గురించి ఓ  మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

తాను ఎంతో కష్టపడి సినిమా రంగంలోకి అడుగుపెట్టానని చెప్పింది. సినిమాల్లోకి రావడం తన కుటుంబసభ్యలకు అసలు ఇష్టం లేదని .. వారిని కష్టపడి ఒప్పించానని ఆమె అంది. తన స్వస్థలం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ అనే చిన్న పట్టణమని తెలిపారు.

 ఇంజినీరింగ్ పూర్తి చేశానని.. చిన్నప్పటి నుంచీ చదువులో టాపరేనని షాలిని చెప్పింది. తాను సినిమాల్లో ప్రయత్నిస్తున్నానని తెలిసి వాళ్ల నాన్న కోప్పడితే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు ఆమె వివరించింది.

 

అయితే ముంబయిలోని తన ఫ్రెండ్స్ ద్వారా రకరకాల ప్రయత్నాలు చేసి ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అవకాసం పొందిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. ఈ సినిమా ఆడిషన్ సమయంలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని దర్శకుడు సందీప్ తనకు చెప్పలేదని ఒకవేళ అప్పుడు చెప్పి ఉంటే ఈసినిమాను బహుశా చేసేదాన్ని కాదేమోనని చెప్పింది.

PREV
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?