కొడుకు, కోడలికి నాగ్ సూపర్ గిఫ్ట్..

Published : Aug 31, 2017, 04:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
కొడుకు, కోడలికి నాగ్ సూపర్ గిఫ్ట్..

సారాంశం

ఏదో ఒక ఆసక్తికర విషయం బయటకు వస్తూనే ఉంది. అక్కినేని కోడలిగా ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అని సమంత ఎంతగా ఎదురు చూస్తుందో.. చైతూ కుటుంబసభ్యలు, అక్కినేని అభిమానులు కూడా అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రిసెప్షన్ ని చాలా గ్రాండ్ గా జరపాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట.

 

అక్కినేని వారి ఇంట త్వరలో పెళ్ళి గంటలు మోగనున్నాయి. అక్టోబర్ 6వ తేదీన సమంత.. అక్కినేని కోడలిగా అడుగుపెట్టనుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థాన్ని ఇరు కుటుంబాల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. .. పెళ్లి పనులు కూడా ప్రారంభించేశారు. చై- సామ్ ప్రేమ సంగతి తెలిసినప్పటి నుంచి.. వీరి గురించి ఎప్పుడూ.. ఏదో ఒక ఆసక్తికర విషయం బయటకు వస్తూనే ఉంది.

అక్కినేని కోడలిగా ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అని సమంత ఎంతగా ఎదురు చూస్తుందో.. చైతూ కుటుంబసభ్యలు, అక్కినేని అభిమానులు కూడా అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే వీరి పెళ్లిని హిందూ, క్రిస్టియన్  రెండు పద్ధతుల్లో జరిపిస్తారన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత.. రిసెప్షన్ ని చాలా గ్రాండ్ గా జరపాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట.

అసలు విషయానికి వస్తే.. నాగ్.. చైతూ, సామ్ లకు పెళ్లి కానుకగా ఓ సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. అదేంటంటే.. అన్నపూర్ణ  స్టూడియోలో వీరిద్దరి కోసం ప్రత్యేకంగా ఒక కాటేజీని నిర్మిస్తున్నారట. కాకపోతే.. అందులో వాళ్లు.. షూటింగ్ సమయంలో ఉండటానికి మాత్రమేనట. అత్యాధునికంగా దీనిని నాగ్.. దగ్గరుండి మరీ డిజైన్ చేయిస్తున్నారట. వీరి పెళ్లిలోపు దానిని పూర్తి చేయించి వారికి ఇవ్వనున్నారని సమాచారం.  ఈ గిఫ్ట్ అందుకున్నాక నాగ చైతన్య, సమంత లు ఎలా రియాక్ట్  అవుతారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు