కంగనా వివాదం.. ప్రభాస్‌కి తలనొప్పిగా మారిందా?

Published : Sep 11, 2020, 02:40 PM IST
కంగనా వివాదం.. ప్రభాస్‌కి తలనొప్పిగా మారిందా?

సారాంశం

నేషనల్‌ స్టార్‌గా దూసుకుపోతున్న ప్రభాస్‌కి కంగనా రనౌత్‌ రూపంలో కొత్త తలనొప్పి నెలకొంది. ఈ వివాదం తన సినిమాలపై ప్రభావం పడనుంది.

ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. ఆయన పేరుతో వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఒక్కో సినిమాకి మూడు వందల నుంచి నాలుగు వందల బడ్జెట్‌ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న మూడు సినిమాలు బడ్జెట్‌ వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం ఆయన పేరుతో దాదాపు పదిహేను వందల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

నేషనల్‌ స్టార్‌గా దూసుకుపోతున్న ప్రభాస్‌కి కంగనా రనౌత్‌ రూపంలో కొత్త తలనొప్పి నెలకొంది. ఈ వివాదం తన సినిమాలపై ప్రభావం పడనుంది. ప్రభాస్‌, కంగనా కలిసి `ఏక్‌ నిరంజన్‌` చిత్రంలో నటించారు. ఈ సినిమా ఫెయిల్‌ అయ్యింది. అయితే ఇప్పుడు కంగనా వ్యవహారం బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు విషయంలో, డ్రగ్స్ కేసు విషయంలో కంగనా అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీంతో శివసేన ప్రభుత్వానికి, కంగనాకి మధ్య ముంబయిలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే కంగనాకి సంబంధించిన వార్తలు రాసే క్రమంలో, మరోవైపు యూట్యూబ్‌ ఛానెల్స్ లో ప్రభాస్‌ హీరోయిన్‌ అంటూ ప్రసారం చేస్తున్నారు. ఇదిప్పుడు ప్రభాస్‌కి పెద్ద తలనొప్పిగా మారింది. 

ఓ వైపు జాతీయ సినిమాలు చేస్తూ, మరింత హైప్‌ పెంచుకునే టైమ్‌లో ఇలా వివాదాల్లో తన పేరుని వాడటం మార్కెట్‌ పరంగా అది దెబ్బ పడే ఛాన్స్ ఉందని క్రిటిక్స్ భావిస్తున్నారు. మరి దీనిపై ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ప్రస్తుతం ప్రభాస్‌.. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో `రాధే శ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం, అలాగే బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ డైరెక్షన్‌లో `ఆదిపురుష్‌` చిత్రాల్లో నటించేందుకు కమిట్‌ అయిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?