ఆ వీడియోకి సమంత ఫిదా.. చూస్తే మనల్నీ కదిలిస్తుంది!

Published : Sep 11, 2020, 12:22 PM ISTUpdated : Sep 11, 2020, 12:23 PM IST
ఆ వీడియోకి సమంత ఫిదా.. చూస్తే మనల్నీ కదిలిస్తుంది!

సారాంశం

మూగ జీవాలకు చెందిన వీడియోని ఎరిక్‌ సోల్హెమ్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. `నిజమైన ప్రేమ ఎప్పటికీ మనుగడ సాధిస్తుంది. టచ్చింగ్‌ స్టోరీ ఫ్రమ్‌ ఇండియా` అని పేర్కొన్నారు. ఈ సంఘటన ఇప్పుడు నెటిజన్ల మనుసుల్ని కదిలిస్తుంది. 

ప్రస్తుతం ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అది మూగ జీవాలకు చెందిన వీడియో. ఓ ప్రాంతంలో ఆవుని వాహనంపై మరో చోటుకి తీసుకెళ్తున్నారు. ఎన్నో రోజులు కలిసి ఉన్న ఆవు వెళ్ళిపోతుండటంతో దానికి తోడుగా ఉన్న ఎద్దు ఒంటరైపోయింది. ఆ ఒంటరి తనాన్ని తట్టుకోలేకపోయింది. 

దీంతో ఆవుని తీసుకెళ్తున్న వాహనం వెంటా పరిగెత్తింది. తనకు దూరం కావడాన్ని తట్టుకోలేక చాలా దూరం దానితోపాటు పరిగెత్తింది. అది చూసి ఆటో డ్రైవర్‌ వాహనాన్ని ఆపాడు. అప్పుడు ఆ ఎద్దు డ్రైవర్‌ వద్దకు వచ్చి బ్రతిమాలినట్టుగా వ్యవహరించింది. వాహనం స్టార్ట్ చేయగా, మళ్ళీ కొంత దూరం పరిగెత్తింది. ఈ సంఘటన అక్కడి ప్రజలను కలచివేసింది. రెండింటిని వేరు చేయడాన్ని, దాన్ని ఆ ఎద్దు తట్టుకోలేకపోవడాన్ని చూసి చలించిపోయారు. 

యాజమానితో మాట్లాడి వాటిని ఒక్కటి చేశారు. రెండింటికి పూజలు చేసి స్థానికులు తమ గొప్ప మనసుని చాటుకున్నారు. ఈ వీడియోని ఎరిక్‌ సోల్హెమ్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. `నిజమైన ప్రేమ ఎప్పటికీ మనుగడ సాధిస్తుంది. టచ్చింగ్‌ స్టోరీ ఫ్రమ్‌ ఇండియా` అని పేర్కొన్నారు. ఇండియాలోని  ఓ ప్రాంతంలోని ఈ సంఘటన ఇప్పుడు నెటిజన్ల మనుసుల్ని కదిలిస్తుంది. 

ఇది చూసిన సమంత ఫిదా అయ్యింది. తాను కూడా లవ్‌ సింబల్‌ మెన్షన్‌ చేస్తూ ఈ వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటం విశేషం. చూస్తే మన మనసుని కూడా కదిలిస్తుందీ వీడియో.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్