`జెంటిల్‌మేన్‌2`కి ప్లాన్‌.. ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

Published : Sep 11, 2020, 01:14 PM IST
`జెంటిల్‌మేన్‌2`కి ప్లాన్‌.. ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

సారాంశం

తాజాగా దాదాపు 27ఏళ్ళ తర్వాత దీనికి సీక్వెల్‌(పార్ట్ 2) రూపొందించేందుకు ముందుకొచ్చారు నిర్మాత కె.టి. కుంజమోన్‌. త్వరలోనే ఈ పార్ట్2ని పట్టాలెక్కించనున్నట్టు తెలిపారు. 

అర్జున్‌, మధుబాల జంటగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన `జెంటిల్‌మేన్‌` సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. శంకర్‌ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కె.టి కుంజమోన్‌ నిర్మించారు. 1993లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో  175రోజులు విజయవంతంగా ఆడింది. భారీ కలెక్షన్లని రాబట్టింది. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

తాజాగా దాదాపు 27ఏళ్ళ తర్వాత దీనికి సీక్వెల్‌(పార్ట్ 2) రూపొందించేందుకు ముందుకొచ్చారు నిర్మాత కె.టి. కుంజమోన్‌. త్వరలోనే ఈ పార్ట్2ని పట్టాలెక్కించనున్నట్టు తెలిపారు. అంతేకాదు మొదటి భాగానికి రెండింతలు బాగుండేలా `జెంటిల్‌మేన్‌2`ని తెరకెక్కించనున్నట్టు చెప్పారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `జెంటిల్‌మే సినిమా తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని సాధించిందని, ప్రపంచ వ్యాప్తం ఎన్నో దేశాల్లో డబ్ అయి ఆదరణ పొందిందని తెలిపారు. మరోసారి అందరి అంచనాలు అందుకునేలా `జెంటిల్‌మేన్‌2`ని రూపొందిస్తామన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నిక్స్ తో సినిమాని తెరకెక్కిస్తామన్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా జెంటిల్‌మేన్‌ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ సంస్థపై చిత్రీకరించనున్నామన్నారు. 

మరి ఇందులో పాత వారినే రిపీట్‌ చేస్తారా? ఇప్పుడున్న యంగ్ స్ట్రర్స్ ని తీసుకుంటారా? దర్శకుడెవరు అనేది తెలియాల్సి ఉంది. జనరల్‌గా సీక్వెల్స్ లు ఆదరణ పొందిన సందర్భాలు తక్కువ. మరి `జెంటిల్‌మేన్‌2` విషయంలో హిట్‌ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా? లేక ఫ్లాప్‌ సెంటిమెంట్‌కే ఓటు వేస్తుందా? అన్నది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్