పవన్ `pspk28` వార్తలు నమ్మవద్దు.. రూమర్స్ పై స్పందించి హరీష్‌ శంకర్‌ టీమ్‌

Published : Jun 08, 2021, 07:39 PM IST
పవన్ `pspk28` వార్తలు నమ్మవద్దు.. రూమర్స్ పై స్పందించి హరీష్‌ శంకర్‌ టీమ్‌

సారాంశం

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ మేడ్‌ ఫోటోగో, దీనికి టైటిల్‌ కూడా కన్ఫమ్‌ అయ్యిందనే వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ స్పందించింది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. `గబ్బర్‌ సింగ్‌` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత వీరి కాంబినేషన్‌లో  pspk28 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. దీన్ని గతేడాదినే ప్రకటించారు. ఈ మేరకు సినిమాకి సంబంధించిన థీమ్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా తెరకెక్కనుంది. థీమ్‌ పోస్టర్‌లో ఇండియా గేట్‌, బుల్లెట్‌ బైక్‌ని, పెద్ద బాలశిక్ష బుక్‌ని చూపించారు. 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బుల్లెట్‌పై పవన్‌ కళ్యాణ్‌ కూర్చొని ఉన్న ఫోటో ఇది. ఫ్యాన్స్ మేడ్‌ ఫోటోగో, దీనికి టైటిల్‌ కూడా కన్ఫమ్‌ అయ్యిందనే వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. సినిమాకి సంబంధించిన తమ నుంచి ఎలా అప్‌డేట్‌ ఇవ్వలేదని, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది యూనిట్‌. 

మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ, `ఈ ఉగాదికి చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలని భావించాం. కానీ కరోనా మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. మేం ఏదైనా అఫీషియల్‌గానే ప్రకటిస్తాం. రైట్‌ టైమ్‌లో ఆ విషయాలు తెలియజేస్తాం` అని తెలిపింది. హరీష్‌ శంకర్‌ సైతం స్పందిస్తూ గాలివార్తలను స్ప్రెడ్‌ చేయవద్దని, నమ్మవద్దని తెలిపారు. మోర్‌ ఎగ్జైటెడ్‌ త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం` అని తెలిపారు. 

ప్రస్తుతం పవన్‌.. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్ర రీమేక్‌లో నటిస్తున్నారు. రానా మరో హీరో. ఇందులో నిత్యా మీనన్‌, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తారని సమాచారం. మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు పవన్‌. ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ సినిమా పట్టాలెక్కనుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి