
యంగ్ హీరో నిఖిల్ గతేడాది తన ప్రియురాలు పల్లవిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలోనే తన ప్రియురాలు, డాక్టర్ పల్లవిని ఆయన అతికొద్ది మంది ప్రముఖుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన లవ్ స్టోరీ తొలుత రివీల్ అయ్యింది ఓ హీరో వద్ద అట. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అల్లు శిరీష్ వద్దనే ఈ విషయాన్ని తెలిపాడట నిఖిల్. ఇదే విషయాన్ని అల్లు శిరీష్ ఇటీవల నిఖిల్‌కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తెలిపారు.
`పల్లవితో డేట్‌కి సంబంధించిన విషయాన్ని మూడో వ్యక్తిగా నాతో పంచుకున్నందుకు గర్వంగా ఉంది నిఖిల్` అని పేర్కొన్నాడు. ఆ సందర్భంగా నిఖిల్ నటిస్తున్న కొత్త సినిమా `18 పేజీస్` ఫస్ట్ లుక్ ని పంచుకుంటూ అభినందనలు తెలిపారు. ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉందని అల్లు శిరీష్ పోస్ట్ చేశాడు. దీనికి నిఖిల్ స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పాడు. తనకు శిరీష్ బెస్ట్ వింగ్‌మ్యాన్ అని పేర్కొన్నాడు. అదే సమయంలో తన ఫస్ట్ లుక్ నచ్చిందని చెప్పినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్ కావడంలోనూ అల్లు శిరీష్ పాత్ర ఉందని తెలుస్తుంది. తన ఫ్రెండ్ అయిన నిఖిల్‌ని తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌కి శిరీష్ పరిచయం చేశారని సమాచారం. ఆయనే `18పేజీస్` సినిమాని సెట్ చేశారనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తుంది. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీవాసు, సుకుమార్ నిర్మాతలుగా, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవల నిఖిల్ బర్త్ డే సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.