రీసెంట్ గా ఉప్పెన సినిమాతో డైరక్టర్ గా బుచ్చిబాబు పరిచయమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉప్పెన స్దాయి కలెక్షన్స్ కురిపించింది. నిర్మాతలకు నమ్మలేని స్దాయి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో తెలుగు పరిశ్రమ మొత్తం ఎవరా దర్శకుడు అంటూ బుచ్చిబాబు వైపు ఒక్కసారి తిరిగిచూసింది.
‘ఉప్పెన’ సక్సెస్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు బుచ్చి బాబు సానాల. దాంతో బుచ్చి బాబుతో పనిచేయడానికి చాలా మంది నిర్మాతలు, హీరోలు ఆసక్తిచూపిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉప్పెన స్దాయి కలెక్షన్స్ కురిపించింది. నిర్మాతలకు నమ్మలేని స్దాయి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో తెలుగు పరిశ్రమ మొత్తం ఎవరా దర్శకుడు అంటూ బుచ్చిబాబు వైపు ఒక్కసారి తిరిగిచూసింది. అనేక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు, బడా స్టార్ హీరోలు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించబోయో ప్రాజెక్ట్‌కే మళ్ళీ బుచ్చి బాబు కమిటయ్యాడు. బుచ్చిబాబు రెండవ సినిమా కూడా ఈ మేకర్స్‌తోనే చేయబోతున్నాడు. అయితే ఈ దర్శకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసేందుకు ఉత్సాహం చూపించాడు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు బుచ్చిబాబు సహాయక దర్శకుడిగా పనిచేశాడు.
ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని ఈ కారణంగానే ఎన్టీఆర్ బుచ్చిబాబుకు చాన్స్ ఇస్తున్నాడని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్లాన్ చేస్తోందని, విశాఖపట్నం నేపథ్యంలో పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఓ కొత్త విషయం బయిటకు వచ్చింది.
అయితే ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలంటే ఏడాది పైన ఆగాల్సిన సిట్యువేషన్ ఉంది. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని రావాలి. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా చేయాలి. ఈ రెండు పూర్తయ్యే సరికి ఈ సంవత్సరం పూర్తవుతుంది. దాంతో జూన్ 2022 దాకా బుచ్చిబాబు వెయిట్ చెయ్యాల్సిన సిట్యువేషన్. ఈ నేపధ్యంలో బుచ్చిబాబు వేరే హీరో కోసం ట్రైల్స్ వేస్తున్నారని వినికిడి. ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్ అంటున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్ తో చేయటానికి అటు వేణు శ్రీరామ్,ఇటు బోయపాటి శ్రీను ట్రైల్స్ వేస్తున్నారు. ఊహించని విధంగా మధ్యలోకి బుచ్చిబాబు వచ్చాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఇంకా ఏమీ ఖరారు కాలేదని, చర్చలు దశలోనే ప్రాజెక్టు ఉందని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ కు చెప్పిన సబ్జెక్టే..బన్ని కు చెప్పాడా లేక వేరే కథ చెప్పాడా అనేది మాత్రం తెలియదు. ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం వరసపెట్టి స్క్రిప్టు లు వింటున్నారు.