అవినాష్‌ది `గమ్యం` గుర్తు.. అఖిల్‌ `బిగ్‌బాస్‌` గుర్తు.. హారిక ఏడుస్తూ.. ఏడిపించింది!

Published : Nov 24, 2020, 11:18 PM IST
అవినాష్‌ది `గమ్యం` గుర్తు.. అఖిల్‌ `బిగ్‌బాస్‌` గుర్తు.. హారిక ఏడుస్తూ.. ఏడిపించింది!

సారాంశం

గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త అవకాశాన్ని కల్పించాడు. ఫైనల్‌కి మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఛాన్స్ ప్రకారం హౌజ్‌లో ఉన్న బిగ్‌బాస్‌ జెండాలను ఎక్కువ కలెక్ట్ చేసిన వారిని రెండో లెవల్‌కి వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. 

బిగ్‌బాస్‌..12వ వారం నామినేట్‌ అయిన సభ్యులకు మరో అవకాశం ఇచ్చాడు. సేవ్‌ అవ్వడానికి అద్భుతమైన ఛాన్స్ ఇచ్చాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త అవకాశాన్ని కల్పించాడు. ఫైనల్‌కి మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఛాన్స్ ప్రకారం హౌజ్‌లో ఉన్న బిగ్‌బాస్‌ జెండాలను ఎక్కువ కలెక్ట్ చేసిన వారిని రెండో లెవల్‌కి వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. ఇందులో అఖిల్‌, అవినాష్‌ ఎక్కువ జెండాలను సేకరించారు. వీరికి ఇంటి సభ్యులు ఓట్లు వేస్తే.. అడిక్షన్‌ ఫ్రీ పాస్‌ లభిస్తుందన్నారు. 

అఖిల్‌, అవినాష్‌ మధ్య ఓట్ల రాజకీయాలు రసవత్తరంగా సాగింది. ఓట్ల కోసం ఓ వైపు అఖిల్‌, మరోవైపు అవినాష్‌ క్యాంపెయిన్‌ చేపట్టారు. ఇందులో అవినాష్‌ `గమ్యం` గుర్తు పెట్టుకోగా, నేను జోకర్‌ని నాకూ లక్ష్యాలున్నాయని నినాదమిచ్చాడు. అఖిల్‌ `బిగ్‌బాస్‌` గుర్తు పెట్టుకున్నారు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని, తనకు ప్రేమతో ఓటు వేయమని, తనకిది చాలా ముఖ్యమని తెలిపారు. ఇందులో అవినాష్‌ క్యాంపెయిన్‌ ఆకట్టుకుంది. 

ఇక ఓట్ల వేసే కార్యక్రమంలో అఖిల్‌కి మోనాల్‌, సోహైల్‌ వేశారు. అవినాష్‌కి అభిజిత్‌, అరియానా వేసింది. హారిక ఓటు ఎవరికనేది ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠభరిత సన్నివేశాలు, హారిక భావోద్వేగం, అవినాష్‌ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని హారిక.. అఖిల్‌కి సారీ చెబుతూ, అవినాష్‌కి ఓటేసింది. అఖిల్‌కి ఓటు వేస్తే తన మనసు కంప్లీట్‌గా లేదన్న భావన కలిగిస్తుందని పేర్కొంది. మొత్తానికి అందరి మనుసులను గెలుచుకుంది హారిక. చివర్లో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అడిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాలిడిటీ రెండు వారాలు ఉంటుందని, కాకపోతే ఒక్కసారే ఉపయోగించుకోవాలన్నారు. దీంతో అవినాష్‌ దాన్ని వేచి ఉంచాలన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి