మహేష్‌ అరుదైన ఘనత.. ఆయనకోసం అక్కడ అరవై లక్షల మంది వెయిటింగ్‌

Published : Nov 24, 2020, 06:06 PM IST
మహేష్‌ అరుదైన ఘనత.. ఆయనకోసం అక్కడ అరవై లక్షల మంది వెయిటింగ్‌

సారాంశం

మహేష్‌బాబు అరుదైన ఘనత సాధించారు. ఆయన ఫాలోయింగ్‌లో మరో రేర్‌ ఫీట్‌ని సాధించారు. అక్కడ ఏకంగా అరవై లక్షల మంది ఫాలో అవుతున్నారు. అది ఎక్కడో కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆయన్ని ఇన్‌స్టాలో ఫాలోఅవుతున్న వారి అభిమానుల సంఖ్య అరవై లక్షలు(ఆరు మిలియన్స్) దాటింది.

మహేష్‌బాబు అరుదైన ఘనత సాధించారు. ఆయన ఫాలోయింగ్‌లో మరో రేర్‌ ఫీట్‌ని సాధించారు. అక్కడ ఏకంగా అరవై లక్షల మంది ఫాలో అవుతున్నారు. అది ఎక్కడో కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆయన్ని ఇన్‌స్టాలో ఫాలోఅవుతున్న వారి అభిమానుల సంఖ్య అరవై లక్షలు(ఆరు మిలియన్స్) దాటింది. ఇంతటి రేర్‌ ఫీట్‌ సాధించడంతో మహేష్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

ఇన్‌స్టాలో ఆరు మిలియన్‌ ఫాలోవర్స్ ఉండగా, ట్విట్టర్‌లో ఇప్పటికే మహేష్‌ పది మిలియన్స్ దాటారు. మహేష్‌ ఎప్పటికప్పుడు తన సినిమా అప్‌డేట్‌లు, ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఖషీ చేస్తున్నారు. అంతేకాదు సామాజిక అంశాలు, సహాయం చేయడం, అభినందలు తెలపడంలో ఇప్పుడు సమాజిక మాధ్యమాలను బాగా వాడుతున్నారు మహేష్‌. టాలీవుడ్‌ హీరోల్లో అల్లు అర్జున్‌ తర్వాత  ఇంతటి ఘనతని సాధించిన స్టార్‌గా మహేష్‌ నిలవడం విశేషం. అల్లు అర్జున్‌ 9మిలియన్స్ కిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కాబోతుంది. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి నుంచి ఇది రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోనుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి