మరో టర్న్ తీసుకున్న మోనాల్‌ లవ్‌ స్టోరీ.. పులిహోర కలుపుతున్న అభిజిత్‌

Published : Nov 24, 2020, 05:27 PM IST
మరో టర్న్ తీసుకున్న మోనాల్‌ లవ్‌ స్టోరీ.. పులిహోర కలుపుతున్న అభిజిత్‌

సారాంశం

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లోని 12వ వారానికి సోమవారం నామినేషన్లు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అవినాష్‌, అఖిల్‌, అరియానా, మోనాల్‌ నామినేట్‌ అయ్యారు. అయితే ఈ నామినేషన్‌కి సంబంధించిన ఫ్రస్టేషన్‌ని వెల్లగక్కుతున్నారు ఇంటిసభ్యులు. 

`ఏడవకు.. ఏడిస్తే లాభం లేదు. మనం సేవ్‌ అవ్వము` అని అవినాష్‌ అంటే.. `అఖిల్‌ పాజిటివ్‌ పర్సన్‌.. ఆయనకు ఏమైందో ఏమో `అని మోనాల్‌ అంటుంది.. `మా నాన్నకు నువ్వు నచ్చావు.. ఏందో ఏమో` అని అభిజిత్‌ అంటున్నాడు. `ఆ మనిషి కొంచెం కూడా స్పందించడ`ని అఖిల్‌ అంటున్నాడు. తాజా ప్రోమో ఆసక్తికరంగా సాగుతుంది 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లోని 12వ వారానికి సోమవారం నామినేషన్లు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అవినాష్‌, అఖిల్‌, అరియానా, మోనాల్‌ నామినేట్‌ అయ్యారు. అయితే ఈ నామినేషన్‌కి సంబంధించిన ఫ్రస్టేషన్‌ని వెల్లగక్కుతున్నారు ఇంటిసభ్యులు. ముఖ్యంగా అవినాష్‌, అఖిల్‌ చాలా ఫీల్‌ అవుతున్నారు. అరియానా నామినేషన్‌ అయినందుకు ఏడుస్తుంటే అవినాష్‌ తన ఫ్రస్టేషన్‌ని వెల్లడించారు. గేమ్‌ చూసి నామినేషన్‌ జరగడం లేదని చెప్పాడు. ఇక కష్టపడి టాస్క్ లు ఆడాల్సిన అవసరం లేదని మండిపడ్డాడు. 

మోనాల్‌ ఇలా చేయడంపై అఖిల్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఓరకంగా అఖిల్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందని చెప్పొచ్చు. సోహైల్‌ వద్త తన గోడుని వెల్లగక్కుతున్నాడు. మరోవైపు అఖిల్‌, మోనాల్‌ లవ్‌ స్టోరీ ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. మళ్ళీ మొదటి రోజులను తలపిస్తుంది. మరోసారి పులిహోర కలిపే బాధ్యత అభిజిత్‌ తీసుకున్నాడనిపిస్తుంది. 

మోనాల్‌తో ఒంటరిగా మాట్లాడుతూ, `అసలు మా నాన్నకు నువ్వు నచ్చావు.. ఏందో ఏమో.. `అన్నాడు. దీంతో అభిజిత్‌ వైపు మోనాల్‌ అదొలా చూసింది. ఆయనపై ప్రేమని మరోసారి ఒలకబోస్తున్న ఫీలింగ్‌ కలిగింది. మోనాల్‌ లవ్‌ స్టోరీ మరో టర్న్ తీసుకుంది. మళ్ళీ వీరిద్దరి మధ్య లవ్‌ స్టోరీ ప్రారంభమవుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Actress Hema: స్టార్ హీరో కొడుకుతో కూతురి పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నటి హేమ, పెళ్లి ఎప్పుడంటే
Allu Arjun: స్టార్ హీరో కొంపముంచిన అల్లు అర్జున్, క్రేజీ సినిమా ఆగిపోయింది ?