Devara: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త.. `దేవర` నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Published : Nov 14, 2023, 08:32 AM ISTUpdated : Nov 14, 2023, 03:12 PM IST
Devara: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త.. `దేవర` నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

సారాంశం

ఎన్టీఆర్‌ నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ `దేవర` మూవీ నుంచి ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త బయటకు వచ్చారు. `దేవర` మూవీ నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతుంది.  

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` సినిమాలో నటిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలోని గుర్తుంపుకి నోచుకోని, గుర్తించని ఓ ప్రాంతంలో జరిగే కథతో దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. భారీ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. భయమంటే తెలియని మనుషులకు భయాన్ని పరిచయం చేసిన ఒక వ్యక్తి కథని చెప్పబోతున్నారు దర్శకుడు. సినిమా ఎక్కువగా వాటర్‌లోనే సాగుతుందట. ఈ అంశాలే ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇప్పటికీ సస్టెయిన్‌ చేస్తున్నాయి. 

ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా కావడం విశేషం. అలాగే సైఫ్‌ అలీ ఖాన్‌ కూడా ఈ మూవీలో విలన్‌ పాత్రని పోషిస్తున్నారు. హాలీవుడ్‌ యాక్షన్‌ స్టంట్స్ మాస్టర్‌, ఇతర టెక్నిషియన్లు ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. సినిమా ప్రకటించి దాదాపు ఏడాది తర్వాత ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. ఏప్రిల్‌ నుంచి రెగ్యూలర్‌ షూట్‌ చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్‌ వర్క్ పక్కగా చేసుకుని షూటింగ్‌ స్టార్ట్ చేశారు కొరటాల అందుకే డిలే అయ్యిందని సమాచారం. 

షూటింగ్‌ ప్రారంభమైనప్పట్నుంచి గ్యాప్‌ లేకుండా చిత్రీకరణ జరుగుతుంది. చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఈ నెల 7 వరకు గోవా షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ప్రస్తుతం దీపావళి పండగ గ్యాప్‌ ఇచ్చారు. మళ్లీ వచ్చేవారంలో మరో షెడ్యూల్‌ని ప్రారంభించబోతున్నారట.  అయితే ఇప్పుడు తారక్‌ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయ్యిందట. మేజర్‌ పార్ట్ షూటింగ్‌ అయిపోయిందని అంటున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందట. దాదాపు మూడు నెలలో పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్, సీజీ వర్క్ ని కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 5న పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు.

Read more: #Salaar లో గెస్ట్ రోల్ ఆ హీరో? నిజమైతే మామూలుగా ఉండదు

ఇక ఈ మూవీని రెండు పార్ట్ లుగా తీసుకొస్తున్నారు. భారీ బడ్జెట్‌ పెట్టి సినిమాలు తీస్తున్న నేపథ్యంలో కలెక్షన్ల రికవరీకి కోసం రెండు పార్ట్ లుగా చేస్తున్నారు. అందులో భాగంగానే `దేవర` మూవీని కూడా రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్నారని సమాచారం. ఏప్రిల్‌లో మొదటి భాగాన్ని, 2025 లో రెండో పార్ట్ ని విడుదల చేయాలనుకుంటున్నారట. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.

Read more: బాబి సినిమాకు బాలయ్య రెమ్యునేషన్ పెంచేసాడు, ఎంతంటే
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్