#HanuMan:‘హనుమాన్’ OTT ఇలా దెబ్బేసారేంటి

By Surya Prakash  |  First Published Mar 8, 2024, 4:18 PM IST

అమలాపురం టు అమెరికా వరకు హనుమాన్ పై కాసుల వర్షం కురుసింది.  40 కోట్లతో నిర్మించగా ఇప్పటివరకు రూ.330 కోట్లు వసూలు చేసింది. 



సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన హనుమాన్  చిత్రం శివరాత్రి రోజు ఓటిటిలోకి వస్తుందని అందరూ భావించారు. ఓ రకంగా మీడియాలోనూ అదే ప్రచారం జరిగింది. ప్రేక్షకులు వెయిట్ చేసారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మొదట ఇది మార్చి 2 నుంచి ‘జీ5’లో స్ట్రీమింగ్‌ అవుతుందని టాక్ వినిపించింది. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రసారం కానుందని   ప్రచారం జరిగింది. దీంతో నెటిజన్లు జీ5ను ట్యాగ్‌ చేస్తూ ‘హనుమాన్’ ఓటీటీ విడుదలపై సమాచారం చెప్పమని అడుగుతున్నారు. తాజాగా  యూజర్లకు సదరు సంస్థ రిప్లై ఇచ్చింది. ‘‘హనుమాన్‌’ ఓటీటీపై మాకు ఇంకా సమాచారం రాలేదు. అందుకే దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మరిన్ని అప్‌డేట్స్‌కు మా సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించండి’ అని పేర్కొంది. దీంతో మరోసారి ఈ చిత్రం కోసం ఎదురుచూసే వారికి నిరాశే ఎదురైంది. 

ఇక  92 ఏళ్ళ తెలుగు సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్రలో హనుమాన్ సృష్టించిన రికార్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అండర్ డాగ్ గా పెద్దగా ఎవరూ పట్టించుకోని స్దితిలో  రిలీజైన హనుమాన్ సినిమా స్టార్ హీరోలతో పోటీలో విన్నర్ గా ఎమర్జ్ అయ్యింది. మొదిటి రోజు నుంచే క్లీన్ హిట్‌ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ బిజినెస్ ఇప్పటికి క్లోజ్  అయ్యింది. మొదటి వారంలో తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… మూడో రోజు నుంచి థియేటర్స్ కౌంట్ పెంచుకోని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఈ రేంజ్ హిట్ ఊహించి ఉండరు. అమలాపురం టు అమెరికా వరకు హనుమాన్ పై కాసుల వర్షం కురుసింది. 

Latest Videos

undefined

40 కోట్లతో నిర్మించగా ఇప్పటివరకు రూ.330 కోట్లు వసూలు చేసింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల చిత్ర టీమ్  ఘనంగా ఈవెంట్‌ను నిర్వహించింది. అందులో దర్శకుడు మాట్లాడుతూ.. మంచి సినిమాపై ప్రేక్షకులు చూపే అభిమానం ఎంతటి కష్టాన్ని అయినా మరిపిస్తుందన్నారు.  ‘హనుమాన్‌’ అద్భుత విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తేజ సజ్జా (Teja sajja) హనుమంతుగా మెప్పించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), అమృత అయ్యర్‌, సముద్రఖని, వినయ్‌రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటించారు.  

తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంది.    హనుమాన్ సినిమా భారతీయ భాషలైన తెలుగు, హిందీ, మరాఠీ,తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రిలీజ్ అవటం విశేషం. ఈ మూవీని నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. 

   

click me!