శివరాత్రికి బాలయ్య శివతాండవం.. NBK 109 గ్లింప్స్ అప్డేట్ వచ్చేసింది

Published : Mar 07, 2024, 08:19 PM IST
శివరాత్రికి బాలయ్య శివతాండవం.. NBK 109 గ్లింప్స్ అప్డేట్ వచ్చేసింది

సారాంశం

అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తర్వాత బాలయ్య నటించే తదుపరి చిత్రంపై అంచనాలు తప్పకుండా పీక్స్ కి వెళతాయి. అలాంటి బాలయ్యతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తోడైతే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది.

అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తర్వాత బాలయ్య నటించే తదుపరి చిత్రంపై అంచనాలు తప్పకుండా పీక్స్ కి వెళతాయి. అలాంటి బాలయ్యతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తోడైతే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. 

అదే ఊపులో నందమూరి బాలకృష్ణతో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.బాలకృష్ణ 109వ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. నందమూరి అభిమానులంతా ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

మార్చి 8న మహా శివరాత్రి కావడంతో ఎన్బీకే 109 చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా మార్చి 8న పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.బాలయ్య ముఖం కనిపించకుండా ఒక పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే బాలయ్య మరోసారి ఊచకోత మొదలు పెట్టేలా ఉన్నాడు. 

గొడ్డలి పట్టుకుని వెహికల్ నుంచి దిగుతున్నట్లు ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ లో కూలెస్ట్ అండ్ క్రూయలెస్ట్ అని బాలయ్య పాత్రని అభివర్ణించారు. పోస్టరే ఇలా ఉంటే ఇక గ్లింప్స్ లో బాలయ్య శివతాండవం ఖాయం అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ చిత్రంతో బాలయ్య జైత్ర యాత్ర కొనసాగాలని కోరుకుంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి