రెమ్యునరేషన్ పెంచిన తేజ్ సజ్జా.. హానుమాన్ సక్సెస్ కిక్ బాగా ఎక్కిందిగా..?

By Mahesh Jujjuri  |  First Published Feb 10, 2024, 2:41 PM IST

సక్సెస్ కిక్ బాగా ఎక్కేసినట్టుంది తేజ సజ్జాకు. ప్రస్తుతం హనుమాన్ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. 
 



టాలీవుడ్ నుంచి చిన్న పెద్దా సినిమాలన్నీ పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల హడావిడే కనిపిస్తుంది. ఈ సినిమాట్ ట్రెండ్ బాగా నడుస్తోంది. చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేసి.. తమ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే బాల నటుడి నుంచి హీరో మెటీరియల్ గా తనను తాను నిరూపించుకుుంటున్నాడు తేజ సజ్జా. వరుసగా హిట్లు పడుతున్నాయి యంగ్ హీరోకు. ఇక తాజాగా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు తేజ. 

తేజ నటించిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్  సొంతం చేసుకొని అందరి చేత శబాష్ అనిపించుకుంది. అంతే కాదు ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా  స్టార్ హీరోలతో పోటీ పడి మరీ విన్ అయ్యాడు తేజ్ సజ్జా. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను కూడా వెనక్కి నెట్టి.. భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. 

Latest Videos

ఇక హనుమాన్ తెలుగుతో పాటు రిలీజ్ అయిన  కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోకి కూడా హనుమాన్ దుమ్మురేపింది. ..  సూపర్ హిట్ గా నిలిచింది. ఫైనల్ గా ఓవర్ సిస్ తో కలుపుకుని.. దాదాపుగా  300 కోట్లకు పైగా వసూలు చేసింది చిన్న సినిమా. ఇక ప్రసస్తుతం తేజ సజ్జాకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతున్నాయి.  హీరోలు సూపర్ హిట్ కొడితే.. వారి రెమ్యునరేషన్ పెంచడం కామన్.. ఇప్పుడిప్పుడే సక్సెస్ లు సాధిస్తున్నవారు రేట్లు పెంచేయడం కామన్.. తేజ్ సజ్జా కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడిప్పుడు 

ఆ హీరో వల్ల కన్యత్వం కోల్పోయాను.. శిల్పా శెట్టి షాకింగ్ కామెంట్స్ వైరల్..

హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జ కోటి రూపాయలలోపే రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. అయితే ఈసినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవ్వడం.. సినిమా 300 కోట్లు వసూలు చేయడంతో.. తేజ్ సజ్జా ఈ జోష్ లో రేటు పెంచాడని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా హీరోగా.. 300 కోట్ల క్లబ్ లో చేరి స్టార్ గా మారిన తేజ్.. నెక్ట్స్ సినిమాలకు 5 నుంచి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. వార్తల్లో నిజమెంతో తెలియదు కాని.. ప్రస్తుతం తేజ సజ్జా పాన్ ఇండియా హీరో కావడంతో.. ఆయన ఆమాత్రం డిమాండ్ చేయడంతో తప్పులేదంటున్నారు సినిమా జనాలు. 

click me!