#LalSalaam రజనీ ‘లాల్‌సలామ్‌’ఫస్ట్ డే షేర్ అంత దారుణమా?

By Surya Prakash  |  First Published Feb 10, 2024, 1:08 PM IST

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే వాషౌట్ అయిపొయింది.  తమిళ్ లో కూడా 5 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7 కోట్ల రేంజ్ లోనే ..



లాస్ట్ ఇయిర్  ‘జైలర్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించి. మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు రజనీకాంత్‌ (Rajinikanth). ఆ  జోష్‌లోనే ‘లాల్‌ సలాం’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కుమార్తె ఐశ్వర్య ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అందరి దృష్టీ పడింది. విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా నటించిన  ఈ సినిమా నిన్న శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న స్దాయిలో బజ్ తెచ్చుకోలేదు. ఓపినింగ్స్ రప్పించుకోలేదు. సరికదా కలెక్షన్స్ వైజ్ కూడా చాలా పూర్ గా ఉంది.

ఈ సినిమా ఆశ్చర్యంగా మినిమమ్ హైప్ కూడా లేకపోవటంతో  మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా సెంటర్స్ లో రిలీజ్ ఇష్యూలను ఎదుర్కొంది. నూన్ షోలు చాలా చోట్ల కంటెంట్ డిల్ తో కాన్సిల్ అయ్యాయి. దాంతో ఈ గజిబిజి వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా తక్కువ నెంబర్స్ తో ఓపెన్ అయ్యింది.  అలాగే చాలా చోట్ల డెఫిసిట్ లతో  నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంది. థియేటర్స్ వారిని  తీవ్రంగా నిరాశ పరిచింది.  షేర్ ఆల్ మోస్ట్ జీరో అనిపించే లెవల్ లో ఉందని ఓవరాల్ గా  20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే వాషౌట్ అయిపొయింది.  తమిళ్ లో కూడా 5 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది.  
 
 లాల్ సలామ్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.  మొదట ఈ సినిమాకు రజనీ ఒప్పుకున్నది కేవలం తన కూతురు దర్శకత్వం అనే అనేది నిజం. లేకపోతే రజనీ గెస్ట్ రోల్ లో చేయరు. కానీ ట్రైలర్, టీజర్ రిలీజైన తర్వాత ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో నటించారు.  ఒక చిన్న గ్రామంలో రెండు మతలా మధ్య వైరం, దానికి క్రికెట్ పోటీ వంటి భావోద్వేగాలతో లాల్ సలామ్ తెరకెక్కించారు.
 

Latest Videos

click me!