నాగార్జునకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్

Published : Jul 02, 2017, 07:13 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
నాగార్జునకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్

సారాంశం

అబుదాబిలో సైమా అవార్డుల వేడుక ఈ వేడుకలో పాట పాడి నాగార్జునకు సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్ అఖిల్ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న అఖిల్

సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2017 వేడుక అబుదాబిలో జరిగింది. ఈ వేడుకలో అక్కినేని అఖిల్  సెంటర్ ఆఫ అట్రాక్షన్ గా నిలిచాడు. అఖిల్ కొత్త అవతారాన్ని చూసి చాలామంది షాక్ అయారు. అఖిల్ మొదట్లో క్రికెట్ పట్ల చూపుతున్న ఉత్సాహాన్ని గ్రహించిన చాలామంది అఖిల్ పెద్ద క్రికెటర్ అవుతాడనుకున్నారు. కానీ వంశాచారంగా హీరోగా మారిన అఖిల్..తన తొలి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయినా... కుటుంబ వారసత్వ పరంగా ఉన్న ఇమేజ్ తో అఖిల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఏ మాత్రం లోటు లేదు. 

 

ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న రీ లాంచ్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా అఖిల్ సైమా వేడుక లాంటి వేడుకల్లో కనిపిస్తూ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అఖిల్ అబుదాబీలో జరిగిన ‘సైమా’ అవార్డు వేడుకలో పాట పాడి అందరినీ ఆశ్చర్య పరిచాడు.  అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం బయటపడింది.

 

అఖిల్ కు చిన్నప్పటి నుంచి పాటలపై ఆసక్తి ఉండటంతో.. అఖిల్ తల్లి అమల పాటలు పాడటంలో శిక్షణ ఇప్పించిందట. ఇప్పుడు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఇలా ఉండగా అఖిల్ ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ వేదిక పై పాటలు పాడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని అంటున్నాడు నాగార్జున.

 

ఇలా ఉండగా అఖిల్..తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మాస్ మసాల సినిమాను చేయించడానికి రంగం సిద్ధం అయినట్లు సమాచారం. ఒక వైపు క్లాస్ ప్రేక్షకులను మరొక వైపు మాస్ ప్రేక్షకులను ఆకర్షించే సినిమాలు చేయిస్తూ అఖిల్ కెరియర్ ను చక్క దిద్దాలని నాగార్జున గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. నాగార్జున ఆశలు అఖిల్ తాజా సినిమాతో నెరవేరుతాయా లేక బోయపాటి సినిమా దాకా వెయిట్ చేయాల్సి వస్తుందో తెలిదు గాని ఈసారి మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ