
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలి ఇప్పుడు తమిళంలో స్థిరపడిపోయిన ముంబై ముద్దుగుమ్మ హన్సిక . ‘దేశముదురు’ తో హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక.. ఈ 11ఏళ్ల కాలంలో ఆమె ఎన్నో విభిన్న పాత్రలు చేసింది. ప్రస్తుతం తన 50వ చిత్రంగా యూఆర్ జమీల్ దర్శకత్వంలో మహా అనే చిత్రం చేస్తుంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తాజాగా విడుదలై ఆశ్చర్యపరిచింది. ఈ లుక్ లో హన్సిక డిఫరెంట్ షేడ్స్‌లో వెరైటీ గా కనిపిస్తుంది. ఒక పోస్టర్‌లో మాస్క్‌లను చేతిలో పట్టుకుని, మరో పోస్టర్‌లో కుర్చీలో కూర్చొని గంజాయి దమ్ము పీలుస్తున్న పోజుతో హన్సిక రెండు రకాలుగా కనిపించారు. గతంలో ఎప్పుడు చేయని పాత్రని హన్సిక ఈ చిత్రంలో చేస్తుందని అర్దమవుతోంది.
ఈ సినిమాలో డిఫెరెంట్ రోల్ లో హన్సిక ఎమోషన్స్‌ని అద్భుతంగా పండించబోతోందిట. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా మార్కస్ పని చేస్తున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో ‘100, తుపాకీ మునై’ హన్సిక నటించిన చిత్రాలు. ‘తుపాకీ మున్నై’ ఈ నెల 14న విడుదల కానుంది. మరో ప్రక్క హన్సిక తెలుగులో సందీప్ కిషన్ తో కలిసి జి. నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.యల్’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.