‘వినయ విధేయ రామ’...ఈ వార్త మీడియా వండినదేనా?

Published : Dec 10, 2018, 07:47 AM IST
‘వినయ విధేయ రామ’...ఈ వార్త మీడియా వండినదేనా?

సారాంశం

అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు కొన్ని వార్తలను మీడియా వండి వడ్డించేస్తూంటుంది. వెబ్ మీడియా వచ్చాక వాటి జోరు మరీ ఎక్కువైపోయింది. 

అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు కొన్ని వార్తలను మీడియా వండి వడ్డించేస్తూంటుంది. వెబ్ మీడియా వచ్చాక వాటి జోరు మరీ ఎక్కువైపోయింది. దాంతో నిజమైన వార్త ఏది..ఏది వండిన వార్త అనేది తెలియకుండా పోతోంది. తాజాగా రామ్ చరణ్ చిత్రం ‘వినయ విధేయ రామ’ గురించిన ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.  అదేమిటంటే..

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని.. అతిత్వరలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.  ఈ వేడుకకు రాజమౌళి, ఎన్టీఆర్‌లను చీఫ్ గెస్ట్‌లుగా ఆహ్వానించారనేది వార్త. 

అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబో లో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కుతున్న నేపధ్యంలో వండేసిన వార్త ఇది అంటున్నారు. అంతేకానీ ఇందులో నిజం లేదని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి.  అలాంటిదేమైనా ఉంటే ఈ పాటికి ప్రకటన వచ్చేదని చెప్తున్నారు.

ఈ ఆడియో పంక్షన్ కు చిరంజీవి ని మాత్రమే  పిలిచారని, అవకాశం ఉంటే అల్లు అర్జున్ వస్తారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ ఏర్పాట్ల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 

     

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌