
బాలీవుడ్ లో పాపులర్ అయిన సెలెబ్రిటీల చిట్ చాట్ షో కాఫీ విత్ కరణ్. ఈ షో లో పాల్గొనాలని చాలా మంది సినీ సెలబ్రెటీలు ఉత్సాహం చూపిస్తూంటారు. ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించే ఈ షో కు విపరీతమైన ప్రజాదారణ ఉంది..మంచి టీఆర్పీలు ఉన్నాయి. అయితే కరణ్ జోహార్ చాలా సెలక్టివ్ గా ఈ షోకు సెలబ్రెటీలను ఆహ్వానిస్తూంటారు. తాజాగా కరణ్ దృష్ణి బాహుబలి ప్రభాస్ పై పడింది .
ఎలాగో సాహో ను బాలీవుడ్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఈ షో ద్వారా బాలీవుడ్ కు దగ్గర కావొచ్చని ఆయనా వెళ్ళారు. మరోవైపు కరణ్ ఈ షోకు పిలిచి, ప్రభాస్ ను సినిమాకు లాక్ చేయించాలని రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన షోలో ప్రభాస్, రానా, రాజమౌళి పాల్గొన్నారు.
త్వరలో ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ లో రాజమౌళి, ప్రభాస్, రానా ‘బాహుబలి’ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారట. ముఖ్యంగా తన బలహీనత గురించి ప్రభాస్ చెప్తూ... ‘నేను చాలా బద్ధకస్తుడ్ని. అదే నా పెద్ద బలహీనత’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ చెప్పారట.
ఇక ప్రభాస్, రానాల పెళ్లి గురించి కరణ్ ప్రశ్నించినప్పుడు రాజమౌళి కలుగజేసుకుని ప్రభాస్ కంటే ముందే రానా పెళ్లి పీటలు ఎక్కుతారని చెప్పారని షో లో చెప్పినట్లు సమాచారం. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన టాప్ 5 సినిమాల్లో ‘బాహుబలి’ ఉంటుంది. అలాగే ‘బాహుబలి’ సినిమాను హిందీలో కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూట్ చేశారన్న విషయం తెలిసిందే.