నయనతార త్రిషలా నాకు వయసవ్వలేదు:  హన్సిక

Published : Feb 01, 2017, 05:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
నయనతార త్రిషలా నాకు వయసవ్వలేదు:  హన్సిక

సారాంశం

తమిళం  తెలుగు భాషల్లో కథానాయకిగా మంచి గుర్తింపు పొందిన నటి హన్సిక నయనతార  త్రిషలా నాకు వయసవ్వలేదు అంటోంది హిరోయిన్  హన్సిక



  అలాంటి హన్సికకు అనూహ్యంగా మార్కెట్‌ డౌన్  అయ్యింది. చేతిలో ఒక్క చిత్రం లేదు. తెలుగులో చాలా గ్యాప్‌ తరువాత నటించిన లక్కున్నోడు చిత్రం ఇటీవలే విడుదలైంది.ఇక తమిళంలో జయంరవికి జంటగా ముచ్చటగా మూడోసారి నటించిన భోగన్  చిత్రం ఫిబ్రవరి రెండవ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే హన్సికకు కొత్త అవకాశాలేమైనా వస్తాయేమో. కొత్త అవకాశాల కోసం గాలం వేసే పనిలో పడ్డారీ అమ్మడు.

 అందులో భాగంగా తానెప్పుడూ హీరోలను దృష్టిలో పెట్టుకుని చిత్రాలను ఒప్పుకోలేదని, తన కథాపాత్రలు నచ్చితేనే అంగీకరించి నటించానని చెప్పుకొచ్చారు. కథ నచ్చక ప్రముఖ హీరోల చిత్రాలు కూడా వదిలేశానని అన్నారు. ఇకపోతే నూతన నటుల సరసస నటిస్తారా? అని చాలా మంది అడుగుతున్నారని, అలాంటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు.

అదే విధంగా నయనతార, త్రిషలా హీరోయిన్  ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు నయనతార, త్రిషలా తనకు వయసవ్వలేదని, ఇప్పటికి తన వయసు 25 నని అన్నారు. వారి వయసుకు వచ్చిన తరువాత అలాంటి పాత్రల గురించి ఆలోచిస్తానని చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తన వయసుకు తగ్గట్టు యూత్‌ఫుల్‌ పాత్రల్లోనే నటిస్తానని హన్సిక చెప్పుకొచ్చారు.

 అయితే అలాంటి అవకాశాలు ప్రస్తుతానికి కనుచూపుమేరలో కనిపించడం లేదన్నది గమనార్హం. ఆఫ్టర్‌ భోగన్  ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూద్దాం
 

PREV
click me!

Recommended Stories

Samantha: రాజ్ తో పెళ్లితో పాటు ఈ ఏడాది సమంత జీవితాన్ని మార్చేసిన మరో సంఘటన.. ఇయర్ ఎండ్ లో బయటపెట్టిందిగా
Gunde Ninda Gudi Gantalu:మనోజ్ మాటలకు ఏడ్చేసిన రోహిణీ, అందరి మనసులు గెలిచిన బాలు, మీనా