ఏపీకి పవన్ కళ్యాణ్, తెలంగాణకు సమంత

Published : Jan 31, 2017, 03:22 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
ఏపీకి పవన్ కళ్యాణ్, తెలంగాణకు సమంత

సారాంశం

తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ ఎంబాజిడర్ గా సమంత ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ ఎంబాజిడర్ గా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ సమంత నియమాకంతో ఇక్కడ ఈమె, అక్కడ పవన్ ఎంబాజిడర్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా స్వచ్ఛందంగా ముంందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కూడా సినీతారను బ్రాండ్ ఎంబాజిడర్ గా నియమించి చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో అక్కినేని సమంతను రంగంలోకి దింపింది. స్వయంగా మంత్రి కేటీఆర్ నటి సమంతను ఇందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది.

కేటీఆర్ కోరిక మేరకు రాష్ట్ర చేనేత సహకారసంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండేందుకు సమంత అంగీకారం తెలిపారు. ఈ అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని సమంత సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సమంతకు మంత్రి కేటీఆర్‌ పోచంపల్లి చీరను బహుకరించారు. మంత్రి కేటీర్, నాగార్జున మధ్య మంచి స్నేహం ఉంది. ఆ పరిచయం తోనే నాగార్జున ద్వారా సమంతను ఒప్పించినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో సమంతను రంగంలోకి దింపడం చర్చనీయాంశం అయింది. ఈ అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని సమంత సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు

PREV
click me!

Recommended Stories

నాగార్జున సినిమాల్లో తనకు ఏమాత్రం నచ్చని ఏకైక మూవీ ఏదో తెలుసా?
నీలి రంగు లెహెంగాలో ఆషికా అందం