బయటపడ్డ `గుంటూరు కారం` బుక్‌ మై షో స్కామ్‌..? ఆ రెండు చోట్ల నుంచే..

By Aithagoni Raju  |  First Published Jan 21, 2024, 11:20 PM IST

మహేష్‌ బాబు నటించిన `గుంటూరు కారం` సినిమాకి సంబంధించి బుక్‌ మై షో లో స్కామ్‌ జరిగిందని మేకర్స్ భావించారు. తాజాగా దీనికి సంబంధించిన మూలాలు బయటపడ్డాయి. 


మహేష్‌ బాబు నటించిన `గుంటూరు కారం` సినిమాకి ఫస్ట్ షో నుంచి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. రేటింగ్‌ విషయంలోనూ నెగటివ్‌ కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా బుక్‌ మై షో(బీఎంఎస్‌)లో చాలా తక్కువ రేటింగ్‌ వచ్చింది. ఎలాంటి డిజాస్టర్‌ మూవీకైనా ఏడుకుపైగా రేటింగ్‌ వస్తుంటుంది. కానీ ఇందులో `గుంటూరు కారం` చిత్రానికి 6.7 రేటింగ్‌ మాత్రమే వచ్చింది. దీంతో మహేష్‌ బాబు వంటి సూపర్‌ స్టార్‌ మూవీకి ఇంతటి తక్కువ రేటింగ్‌ రావడంతో అంతా షాక్‌ అవుతున్నారు. 

బుక్‌ మై షోలో ఇంతటి తక్కువ రేటింగ్‌ రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏదో కుట్ర జరిగిందని టీమ్‌ భావించింది. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసు వారికి `గుంటూరు కారం` నిర్మాతలు ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులు దీనిపై విచారణ చేపట్టగా, కొన్ని మూలాలు కనుకొన్నట్టు తెలుస్తుంది. బెంగుళూరు, నర్సరావు పేట నుంచి ప్రధానంగా ఈ స్కామ్‌ జరిగిందని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. 

Latest Videos

సుమారు 15వేల అకౌంట్‌ యూజర్లు జీరో రేటింగ్‌ వేసినట్టు తెలుస్తుంది. వాళ్లు పనిగట్టుకుని ఈ పనిచేశారని, 15వేల యూజర్లు జీరో రేటింగ్‌ వేయడంతో ఓవరాల్‌గా రేటింగ్‌ పడిపోతుంది. మహేష్‌ బాబు మూవీకి అదేజరిగిందని తెలుస్తుంది. మరి అందుకు కారకులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. కొందరు దుండగులు కావాలనే కుట్ర చేసినట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి వారి ఉద్దేశ్యమేంటనేది తెలియాల్సి ఉంది. 

ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది `గుంటూరు కారం`. మొదటిఆట నుంచే నెగటివ్ టాక్‌ వచ్చింది. విపరీతంగా ట్రోల్‌ అయ్యింది. మొదటి రోజులు బాగా నెగటివ్‌ రావడంతో ఆ తర్వాత సినిమాపై ప్రభావం పడింది. తర్వాత కాస్త మెరుగ్గానే ఉంది. సంక్రాంతి సెలవుల్లో ఈ మూవీ బాగానే వసూలు చేసింది. కానీ ఆ తర్వాత పడిపోయింది. తొమ్మిది రోజుల్లో ఈ మూవీకి 216కోట్ల గ్రాస్‌, 105కోట్ల షేర్‌ వచ్చింది. ఇంకా ముప్పై కోట్ల షేర్‌ వస్తేగానీ ఈమూవీ బ్రేక్‌ ఈవెన్‌ కాదు. కానీ కొన్ని చోట్ల మాత్రం బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని సమాచారం. నైజాం, ఓవర్సీస్‌లో గట్టి దెబ్బ పడబోతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌. మీనాక్షి చౌదరి, ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ, జయారం, ఈశ్వరీరావు ముఖ్య పాత్రల్లో నటించారు. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సినిమా తెరకెక్కింది. 
 

click me!