ఢిల్లీ పోలీసులకు థ్యాంక్స్ చెప్పిన రష్మిక మందన్నా.. అమ్మాయిల్లో ధైర్యం నింపుతూ పోస్ట్

By Aithagoni Raju  |  First Published Jan 21, 2024, 9:01 PM IST

రష్మిక మందన్నా ఢిల్లీ పోలీసులకు థ్యాంక్స్ చెప్పింది. తన డీప్‌ ఫేక్‌ వీడియోలు సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె రియాక్ట్ అయ్యింది. 


నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా.. ఇటీవల మార్ఫింగ్‌కి గురైన విషయం తెలిసిందే. ఆమె ఫేక్‌ వీడియోలు వైరల్‌ అయ్యాయి. డీప్‌ ఫేక్‌ వీడియోలను సృష్టించి రష్మికని కొందరు దుండగులు ఇబ్బంది పెట్టారు. ఆమె ఫేస్‌ని మార్ఫింగ్‌ చేసి డీప్‌ ఫేక్‌ వీడియోలు సృష్టించి రచ్చ చేశారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీనిపై రష్మిక బాధపడింది. దీన్ని సోషల్‌ మీడియా సమాజం, మీడియా, అభిమానులు వ్యతిరేకించారు. ఇలాంటి నీచపు పనులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో నినదించారు. 

అంతేకాదు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా స్పందించారు. ఇక ఇన్నాళ్లకి దీనికి సంబంధించిన నిందితులను గుర్తించారు పోలీసులు. నిన్న ఢిల్లీ పోలీసులు దుండగులను పట్టుకుని అరెస్ట్ చేశారు. దీంతో తాజాగా దీనిపై రష్మిక మందన్నా స్పందించింది. ఢిల్లీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. 

Latest Videos

`ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేసిన బాధ్యులను పట్టుకున్నందుకు ఢిల్లీ పోలీసులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను ప్రేమతో, మద్దతుతో ఆదరించి, నన్ను రక్షించే సమాజానికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అమ్మాయిలు, అబ్బాయిలు, మీ సమ్మతి లేకుండా మీ చిత్రాన్ని ఎక్కడైనా ఉపయోగించినట్టయితే, మార్ఫింగ్‌ చేసినట్టయితే అది నిజంగా తప్పు. ఇలాంటి సమయంలో మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని, చర్యలు తీసుకోబడుతుందని గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నా` అని తెలిపింది రష్మిక. ఆమె పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా.. `పుష్ప 2`లో నటిస్తుంది. అల్లు అర్జున్‌కి జోడీగా చేస్తుంది. సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ మూవీ ఆర్‌ఎస్‌సీలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు `ది గర్ల్ ఫ్రెండ్‌`, `రెయిన్‌బో` చిత్రాలు చేస్తుంది. కొత్తగా ధనుష్‌, నాగార్జున కాంబినేషన్‌లో రూపొందుతున్న శేఖర్ కమ్ముల మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది రష్మిక మందన్నా. అలాగే విజయ్‌ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్‌`లోనూ ఓ సాంగ్‌లో మెరబోతుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. 

click me!