రామ్ పోతినేని ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ Double Ismartలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిన్న అప్డేట్ అందిస్తూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. రామ్ ట్రాన్స్ ఫార్మ్ చూస్తే మతిపోతోంది.
‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్ పోతినేని Ram Pothineni మాస్ ఇమేజ్ ను పెంచుకున్నారు. ఫ్యాన్స్, ఆడియెన్స్ కూడా రామ్ పోతినేని మాస్ ను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ‘స్కంద’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఎనర్జిటిక్ స్టార్ ఫోకస్ పెట్టారు.
ఇక రామ్ పోతినేని - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ Puri Jagannadh కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’ Double Ismart రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, రామ్ పోతినేని లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఈ మూవీ నుంచి పెద్దగా ఎలాంటి అప్డేట్స్ మాత్రం అందలేదు.
కానీ రామ్ పోతినేని మాత్రం తన బాడీని చూపిస్తూ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. కండలు తిరిగిన శరీరాన్ని చూపిస్తూ ఫొటోకు ఫోజిచ్చారు. కానీ తన ముఖాన్ని మాత్రం కవర్ చేశారు. ఈ ఫొటోలో రామ్ పోతినేని ట్రాన్స్ ఫామ్ ఆసక్తికరంగా మారింది. ‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్ పోతినేని... మళ్లీ ‘ఇస్మార్ట్ శంకర్’గా మారిపోయారు. సిక్స్ ప్యాక్ తో మరోసారి వెండితెరపై అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం రామ్ పోతినేని పంచుకున్న ఫొటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ నెక్ట్స్ రాబోయే అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ‘డబుల్ ఇస్మార్ట్’కు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ Sanjay Dutt కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 మార్చి 8న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.