
హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. లెక్క ప్రకారం హరి హర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ చేయాల్సి ఉంది. హరి హర వీరమల్లు షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఏక కాలంలో ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాడని అందరూ భావించారు. అనూహ్యంగా వినోదయ సిత్తం రీమేక్ తెరపైకి వచ్చింది.
తమిళంలో విజయం సాధించిన వినోదయ సిత్తం ని తెలుగులో పవన్-ధరమ్ తేజ్ లతో చేయాలని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా క్లారిటీ కూడా వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు సముద్ర ఖని తెలియజేశారు. సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) ప్రమోషన్స్ సమయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagath singh)చిత్రం పక్కనపెట్టి వినోదయ సిత్తం చేయడానికి పవన్ సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. అలాగే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది, అసలు రద్దైన ఆశ్చర్యం లేదని కథనాలు వెలువడ్డాయి.
అయితే నిన్న అంటే సుందరానికీ (Ante Sundaraniki) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్, హరీష్ శంకర్ లు భవదీయుడు భగత్ సింగ్ ప్రస్తావన తెచ్చారు. ఈ మూవీ చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. దీంతో కొత్త కన్ఫ్యూషన్ మొదలైంది. అసలు వినోదయ సిత్తం రీమేక్ ఉందా లేదా? ఉంటే.. భవదీయుడు కి ముందు వెనుకా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పవన్(Pawan Kalyan) లైన్ అప్ పై గందరగోళం ఏర్పడింది. ఇక హరి హర వీరమల్లు షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తి అయినట్లు సమాచారం. 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.