Ante sundaraniki Pre Release: పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్క మాటతో కడుపు నిండిపోయింది : నాని

Published : Jun 09, 2022, 10:24 PM IST
Ante sundaraniki Pre Release: పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్క మాటతో కడుపు నిండిపోయింది : నాని

సారాంశం

నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఘనంగా జరుగుుతోంది. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. 

నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఘనంగా జరుగుుతోంది. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. 

నాని మాట్లాడుతూ.. అంటే సుందరానికి ఎంటర్టైన్మెంట్ తో పాటు.. ఎంజాయ్ చేసే సినిమా అన్నాను. ఈ సినిమాఅందరం కష్టపడి చేసి సినిమా అని.. తప్పకుండా  ఆడియన్స్ అందరిని అలరిస్తుంది అన్నారు నాని. మరికాసేపట్లో ప్రీమియర్స్ పడుతున్న టైమ్ లో.. ప్రీరిలీజ్ చేసుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచీ దాదాపు అందరు హీరోలను కలిశాను ఒక్క  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారినే కలవలేదు. కాకపోతే అందరిని ఎన్ని సార్లు కలిసినా..అప్పుడే కలిసినట్టు ఉంటుంది. కాని పవన్ కల్యాణ్ గారిని మాత్రం ఇప్పుడు కలిసినా.. ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాను అన్న ఫీలింగ్ కలిగింది. నిజంగా పవన్ గారు రావడం మా టీమ్ అందరికి థ్రిల్లింగ్ గా ఉంది. ఇంకొక విషయం ఏంటీ అంటే.. ఆయన రాగానే నాకు చెప్పిన ఒక్క మాటతో నా కడుపు నిండిపోయింది అన్నారు నాని. 

ఇక నాని నేచురల్ స్టార్ అని నిరూపించుకుంటూనే ఉన్నాడు.రొటీన్ కు భిన్నంగా మూవీస్ చేస్తూ. టాలెంట్ చూపించుకుంటున్నాడు. ఇక నానీ నటించిన తాజా సినిమా అంటే సుందరానికీ. ఈమూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ మధ్య అన్నీ విభిన్న కథలతో... డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో సినిమాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక నానీ హీరోగా వివేక్ ఆత్రేయ  డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా అంటే ... సుందరానికీ.  ఆచార వ్యవహారాలు బాగా పాటించే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. నానీ ఫస్ట్ టైమ్ ఇలాంటి పాత్రలో కనించబోతున్నాడు. 

ఇక  అలాంటి ఆచారాలు పాటించే వ్యాక్తి  విదేశాలకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే  కథతో అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో నాని జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నటించింది. ఈ సినిమా షూటింగ్ అయిపోయి.. పోస్ట్ ప్రొడక్సన్ పనులు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను జూన్ 10 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..