
ఈవెంట్స్ లో అభిమానుల అల్లరి లేకపోతే శోభలేదు. ఎవరినైనా ఎదిరించే ధైర్యం నాకు చిత్ర పరిశ్రమ, అభిమానులు ఇచ్చారు. మా కుటుంబంలోని చిరంజీవి, నాగబాబు, మిగతా సభ్యులు ఎవరైనా మీ కారణంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. సినిమా పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు. నాకు నరేష్ గారికి భిన్నమైన ఆలోచనలు ఉండవచ్చు. రాజకీయాలు వేరు, సినిమా వేరు. ఓ చిత్రాన్ని నిర్మించాలంటే 24 క్రాఫ్ట్స్ కి చెందిన నిపుణులు పని చేయాలి. భిన్న కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన వారందరూ కలిస్తే అంటే సుందరానికీ లాంటి ఓ సినిమా సిద్ధం అవుతుంది.
ఇక నాని గారికి మా ఇంట్లో కూడా అభిమానులు ఉన్నారు. మా సిస్టర్ నాని సినిమాలు చూస్తారు. నాని గారిది విలక్షణ నటన, వ్యక్తిత్వం. ఎదిరించి నిలబడ గల వ్యక్తి. ఆయనకు మంచి విజయాలు అందాలు. భవిష్యత్ లో మరిన్ని సక్సెస్లు దక్కాలి. ఇక సినిమాకు మూల పురుషుడు దర్శకుడు. అంటే సుందరానికీ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయకు నా అభినందనలు, ఈ మూవీ అందరూ బాగుంది అంటున్నారు. నేను కూడా చూస్తాను.
మైత్రి మూవీ మేకర్స్ తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేస్తున్నాను. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నా సినిమా ఫంక్షన్ కాదు. అందుకే నా ఏ వీ వేయవద్దని చెప్పాను. అయినా నా ఏ వీ వేశారు. దానికి నాకు కోపం వచ్చింది. నా ఏ వీ వేయకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు. అందుకే వేసి ఉంటారు. ఆ ఏ వీలో నేను డాన్స్ చేయడం చూస్తే నేనేనా చేసింది అనిపిస్తుంది. నేను డాన్స్ లు వేసేది ఫ్యాన్స్ కోసమే. దర్శక నిర్మాతలు కూడా మీ కోసం నా చేత డాన్స్ లు వేయిస్తున్నారు.
ఇకపై డాన్స్ లు చేయలేను. ఆ విషయంలో నన్ను వదిలేయండి. రాజకీయాల్లో గొడవ పడటం ఈజీ అనిపిస్తుంది. సినిమా చూడాలంటే భయం వేస్తుంది. పాటల్లో నడిచే అవకాశం ఇవ్వండి, ఇకపై డాన్స్ చేయలేను. మీరందరూ బాగుండాలి. క్షేమంగా ఇంటికి వెళ్లండి.. అంటూ పవన్ తన స్పీచ్ ముగించాడు.
అంటే సుందరానికీ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి పవన్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా పొగిడారు. మరి కొన్ని గంటల్లో అంటే సుందరానికీ మూవీ విడుదలవుతుండగా.. పవన్ కళ్యాణ్ కోసం 8న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 9కి షిఫ్ట్ చేశారు.