ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన గవర్నర్ దంపతులు

Published : Jan 21, 2017, 05:01 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన గవర్నర్ దంపతులు

సారాంశం

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని చూసిన గవర్నర్ నరసింహన్ దంపతులు గవర్నర్  దంపతుల నుంచి చిరుకు ప్రశంసల జల్లు

గవర్నర్ నరసింహన్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని సతీసమేతంగా చూసారు . 9 ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో గవర్నర్ దంపతులు కూడా ఆసక్తిగా ఆ చిత్రాన్ని తిలకించారు . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రాన్ని చూడగా గవర్నర్ దంపతులతో పాటు చిరు కుటుంబం కూడా మరోసారి ఈ చిత్రాన్ని వీక్షించారు . సినిమా చూసిన అనంతరం గవర్నర్ నరసింహన్ చిరంజీవి నటన గురించి పదే పదే పొగిడాడట .

పైగా సినిమా ఇతివృత్తం కూడా రైతు సమస్యల పై ఉంది కాబట్టి చాలాబాగుందని కితాబు నిచ్చాడట గవర్నర్ . చరణ్ నిర్మించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం రికార్డులను బద్దలు కొడుతూ తెలుగు టాప్ గ్రాసర్ లలో ఒకటిగా నిలబడుతుంది . ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ల ని కొల్లగొడుతున్న ఈ చిత్రం చిరంజీవి కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ అనే చెప్పాలి .

PREV
click me!

Recommended Stories

'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ లో హీరోయిన్ గా 46 ఏళ్ళ నటి.. దిల్ రాజు ప్లానింగ్ ఇదే
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?