గౌతమ్ నంద మూవీకి ఘట్టమనేని గౌతమ్ కు లింక్

Published : Jul 24, 2017, 11:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
గౌతమ్ నంద మూవీకి ఘట్టమనేని గౌతమ్ కు లింక్

సారాంశం

గౌతమ్ నంద సినిమాలో ఘట్టమనేని గౌతమ్ పాత్రలో గోపీచంద్ ఘట్టమనేని ఇంటిపేరు పెట్టడం దర్శకుడి ఛాయిస్ అన్న గోపీచంద్ తాతలు, తండ్రుల పేరుతో కాకుండా మనమేంటని ఆలోచింపచేసే గౌతమ్ నంద

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తనయుడు ఘట్టమనేని గౌతమ్‌ అన్న సంగతి అందరికి తెలిసిందే. అతడి పేరుకి హీరో గోపిచంద్‌కు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? గోపిచంద్ నటిస్తున్న గౌతమ్‌నంద చిత్రంలో హీరో పాత్ర ఘట్టమనేని గౌతమ్. హీరోకు అలాంటి పేరు పెట్టి ప్రేక్షకుల్లో ఓ ఆసక్తిని రేపాడు దర్శకుడు సంపత్ నంది.

 

జూలై 28న గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో గోపిచంద్.. ఆ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “గౌతమ్‌నంద చిత్రంలో హీరో పాత్ర కోసం బిలియనీర్ల కుమారులపై దర్శకుడు సంపత్ నంది ప్రత్యేకంగా పరిశోధించారు. సంపన్నులకు సంబంధించిన పిల్లల ప్రవర్తన, అలవాట్లు, వేషభాషలపై అవగాహన కల్పించుకున్నాకే గౌతమ్‌నంద చిత్రంలో పాత్రను పక్కాగా డిజైన్ చేశారు. ఆ పాత్రకు ఘట్టమనేని గౌతమ్ అని పేరు పెట్టడం దర్శకుడి నిర్ణయం. ఆ విషయంపై నాకు పెద్దగా వివరాలు తెలియవు” అని గోపిచంద్ చెప్పారు.

 

ఈ చిత్రంలో హన్సిక, కేథరిన్ ఇద్దరు హీరోయిన్లు. హన్సిక క్యారెక్టర్ పేరు స్ఫూర్తి. చాలా ఎక్కువగా మాట్లాడే పాత్ర హన్సికది. తన నేచర్ సాధారణంగా రియల్ లైఫ్ లోనూ అలాగే ఉంటుంది. బాగా మాట్లాడుతుంది. కేథరిన్‌ది చాలా రిచ్ అమ్మాయి పాత్ర. చాలా పొగరుబోతు. ఇద్దరు హీరోయిన్ల సెలక్షన్ కూడా ఫర్‌ఫెక్ట్‌గా అనిపిస్తుంది.

 

అధ్యాత్మిక గురువు రమణ మహర్షి ఫిలాసఫీలోని ఓ పాయింట్ ఆధారంగా గౌతమ్‌నంద చిత్రం రూపొందింది. ప్రతీ మనిషి తాను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తండ్రి పేరు, తాత పేరు చెప్పుకోని గుర్తింపు పొందటం కాకుండా... ప్రతిఒక్కరు అసలు మనం ఎవరు అనే ప్రశ్న వేసుకొనే విధంగా ఈ చిత్ర కథ ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది అన్నారు గోపీచంద్.

 

ఇక గౌతమ్‌నంద చిత్రంలో రెండు కోణాలున్న పాత్ర నాది. దాంతో రజనీకాంత్ నటించిన బాషా చిత్రం మాదిరిగా ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ బాషాకు గౌతమ్‌నందకు ఎలాంటి పోలీకలు ఉండవు. ఈ చిత్ర కథ డిఫరెంట్‌గా ఉంటుంది అని గోపిచంద్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే